Site icon NTV Telugu

వ్యాక్సిన్ వేయించుకుంటే…50 శాతం డిస్కౌంట్‌…

క‌రోనా వ్యాక్సిన్‌పై అవ‌గాహ‌న పెంచేందుకు ప్ర‌భుత్వాల‌తో పాటుగా ప్రైవేట్ సంస్థ‌లు కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.  ప్రైవేట్ సంస్థ‌లు వ్యాక్సిన్ వేయించుకున్న‌వారికి అనేక ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఇందులో భాగంగా త‌మిళ‌నాడులోని మ‌ధురైలోని ఓ సెలూన్ షాప్ య‌జ‌మాని వినూత్న ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించాడు.  

Read: వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి : కేంద్రాన్ని కోరిన కేటీఆర్

వ్యాక్సిన్ తీసుకున్న వారికి సెలూన్ లో 50శాతం డిస్కౌంట్‌ను ప్ర‌క‌టించాడు.  వ్యాక్సిన్ తీసుకుని నెగెటీవ్ స‌ర్టిఫికెట్ తీసుకొని వ‌స్తే 50శాతం డిస్కౌంట్‌లో హెయిర్ క‌ట్ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ప్ర‌జ‌ల్లో వ్యాక్సిన్ ప‌ట్ల అవ‌గాహ‌న పెంచ‌డంతో పాటుగా, మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు త‌న‌వంతుగా ఈ విధంగా చేస్తున్న‌ట్టు తెలిపాడు.  

Exit mobile version