NTV Telugu Site icon

ISRO New Chief: ఇస్రో కొత్త ఛైర్మన్‌గా డాక్టర్‌ వి.నారాయణన్‌..

Isro

Isro

ISRO New Chief: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త ఛైర్మన్‌గా డాక్టర్‌ వి.నారాయణన్‌ ఎంపికయ్యారు. సంస్థకు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న ఎస్‌.సోమనాథ్‌ నుంచి ఆయన ఈ నెల 14వ తేదీన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు క్యాబినెట్‌ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంది. ఆయన రాబోయే రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. నారాయణన్‌.. ప్రస్తుతం ఇస్రోకు చెందిన లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ (ఎల్‌పీఎస్‌సీ)కు చీఫ్ గా కొనసాగుతున్నారు. ఇస్రో సంస్థలో గత నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పని చేసిన ఆయన.. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్‌ చోదక వ్యవస్థల్లో అపార అనుభవం కలిగి ఉన్నారు. ద్రవ, సెమీ క్రయోజెనిక్, క్రయోజెనిక్‌ చోదక వ్యవస్థల అభివృద్ధిలో నారాయణన్ కీలక పాత్ర పోషించారు.

Read Also: US: అమెరికాలో దారుణం.. విమానం ల్యాండింగ్ గేర్‌లో రెండు మృతదేహాలు లభ్యం

అలాగే, ఇస్రోకు చెందిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-2, 3 వాహక నౌకల రూపకల్పనలో కొత్త ఛైర్మన్ నారాయణన్ కీలక భూమిక పోషించారు. ఆదిత్య-ఎల్‌1, చంద్రయాన్‌-2, చంద్రయాన్‌-3లోని చోదక వ్యవస్థల అభివృద్ధికి బాగా కృషి చేశారు. ఇక, తమిళనాడులోని కన్యాకుమారి నారాయణన్‌ స్వస్థలం. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో క్రయోజెనిక్‌ ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకుతో ఎంటెక్‌ కంప్లీట్ చేశారు. 2001లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ సైతం పూర్తి చేశారు ఆయన.

Show comments