Site icon NTV Telugu

VK Sasikala New Political Party: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ.. జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటన..

Vk Sasikala

Vk Sasikala

VK Sasikala New Political Party: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుంది.. కొత్త పార్టీ ప్రకటించారు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ.. రామనాథపురం సభలో కొత్త పార్టీని ప్రకటించారు శశికళ.. త్వరలోనే పార్టీ పేరు ప్రకటిస్తానని వెల్లడించారు శశికళ.. మనం కొత్త రాజకీయ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ పార్టీ పేదలు, అణగారిన వర్గాలు మరియు సామాన్య ప్రజల కోసం పనిచేస్తుంది అని శశికళ పేర్కొన్నారు. పార్టీ ద్రవిడ ఉద్యమాన్ని అనుసరిస్తుందని, ఎంజీఆర్‌, జయలలిత వంటి నేతల బాటలో నడుస్తుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో శశికళ కొత్త పార్టీ జెండాను కూడా ప్రవేశపెట్టారు. ఈ జెండా నలుపు, తెలుపు, ఎరుపు రంగులను కలిగి, పెరారిగ్నార్ అన్నా, ఎంజీఆర్, జయలలిత చిత్రాలను కలిగి ఉంది.

Read Also: Andhra Pradesh Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 56 అజెండా అంశాలకు ఆమోదం..

అయితే, 2016లో జయలలిత మరణం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు శశికళను ముఖ్యమంత్రిగా గూర్చి కోరినప్పటికీ, ఆమె నిరాకరించిందని.. పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల కారణంగా AIADMK నుండి బహిష్కరించబడింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ప్రథమార్థంలో జరగనుండగా.. ఇప్పుడు కొత్త పొలిటికల్‌ పార్టీతో మరింత హీట్‌ పెంచినట్టు అయ్యింది.. అయితే, రాజకీయాల్లో నా మార్క్‌ ఏంటో చూపిస్తాను అని ప్రకటించారు శశికళ.. జయలలితను నేనే చంపానని దుష్ప్రచారం చేశారని ఫైర్‌ అయ్యారు.. మరోవైపు.. పళనిస్వామిని సీఎం చేసి తప్పు చేశాను.. నన్ను పార్టీ నుంచి అవమానకరంగా గెంటేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వీకే శశికళ..

Exit mobile version