Yogi Adityanath: సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ప్రతీక అయిన రక్షాబంధన్ సందర్భంగా మహిళామణులకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రక్షాబంధన్ సందర్భంగా మహిళలు 48 గంటల పాటు మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 11న దేశ వ్యాప్తంగా రక్షాబంధన్‌ను జరుపుకోనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఈ వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రెండు రోజుల పాటు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చని యూపీ సీఎం ప్రకటన చేశారు. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ అర్ధరాత్రి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. ఆ రెండు రోజుల పాటు మహిళలు ఉచితంగా, సురక్షితంగా ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని యూపీ ఆర్టీసీని ఆదేశించారు. ఈ మేరకు సీఎం యోగి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.
Basavaraj Bommai: కర్ణాటక ముఖ్యమంత్రికి కొవిడ్ పాజిటివ్.. ఢిల్లీ పర్యటన రద్దు
యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన ట్వీట్‌లో, రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలంతా బస్సుల్లో సురక్షితంగా ఉచితంగా ప్రయాణించేందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ సదుపాయం కల్పిస్తుందని తెలిపారు. ఆగస్టు 10 అర్ధ రాత్రి నుంచి ఆగస్టు 12 అర్ధరాత్రి వరకు (48 గంటలు) మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపారు. రక్షా బంధన్‌తోపాటు స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా మహిళలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కానుక ఇస్తోంది. శ్రావణ మాసం పౌర్ణమినాడు (ఆగస్టు 12న) రాఖీ పండుగ జరుగుతుందన్న సంగతి తెలిసిందే.
