Site icon NTV Telugu

Uttar Pradesh: అంబులెన్స్‌లో దారుణం.. పేషెంట్‌ భార్యనే లైంగికంగా వేధించిన డ్రైవర్..!

Ambulence

Ambulence

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘాజిపుర్‌లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఘటనలో అంబులెన్స్‌ డ్రైవరే పేషెంట్‌ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించి.. ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్‌ను తొలగించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. సిద్ధార్థ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ ఆగస్టు 28వ తేదీన ఘాజిపుర్‌లోని ఆరావాళి మార్గ్‌లో ఉన్న ఒక హస్పటల్ లో భర్తను జాయిన్ చేసింది. అక్కడ ఖర్చు తట్టుకోలేక తన భర్తను ఇంటికి తీసుకుపోతానని డాక్టర్లను కోరింది.. దీంతో వారు ఆమెకు ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ నెంబర్‌ ఇచ్చారు.

Read Also: Gold Rate Today: బంగారం ప్రియులకు శుభవార్త.. ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్‌ రేట్స్ ఇవే!

ఇక, సదరు మహిళ అంబులెన్స్‌లో తన భర్తను, సోదరుడిని తీసుకొని సిద్ధార్థనగర్‌లోని ఇంటికి స్టార్ట్ అయింది. ప్రయాణం ప్రారంభించే ముందు ఆ డ్రైవర్‌ ఆమెను తనతో పాటు ముందుసీట్లో కూర్చుంటేనే.. రాత్రి వేళ పోలీసులు మధ్యలో ఆపరని తెలిపాడు. దీంతో ఆమె అలాగే చేయడంతో.. మార్గ మధ్యలో డ్రైవర్‌, అతడి సహాయకుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు.. దీనికి సదరు మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు వీరి ప్రవర్తనను గమనించిన ఆమె భర్త, సోదరుడు కేకలు వేశారు. దీంతో చవానీ పోలీస్‌స్టేషన్‌ రోడ్డులో వారు అంబులెన్స్‌ను ఆపి ఆమె భర్తను రోడ్డు పక్కనే పడేసి.. ఆక్సిజన్‌ తొలగించి వెళ్లిపోయారు. సదరు మహిళ దగ్గర 10వేల నగదు, కొన్ని ఆభరణాలు లాక్కొని పారిపోయారు. దీంతో ఆ మహిళ, ఆమె సోదరుడు 112, 108 నెంబర్లకు ఫోన్‌ చేసి పరిస్థితి చెప్పడంతో తక్షణమే పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఆమె భర్తను మరో హస్పటల్ కి తరలించారు. కానీ, అక్కడ అతడి పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఏడీసీపీ జితేంద్ర దూబే మాట్లాడుతూ.. తాము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version