NTV Telugu Site icon

Uttar Pradesh: ఇంటిపై పాకిస్తాన్ జెండా.. వ్యక్తి అరెస్ట్

Pakistan Flag In Uttar Pradesh

Pakistan Flag In Uttar Pradesh

UP Man unfurls Pakistani flag, arrested: భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎంతో గర్వంగా జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 13-15 వరకు ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరేయాలని కోరారు. ఇందుకు తగ్గట్లుగానే దేశ ప్రజలు తమతమ ఇళ్లపై భారత జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నారు. వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలను నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాలు కూడా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండగగా జరుపుకుంటుంటే కొంతమంది దేశ ద్రోహులు మాత్రం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఏకంగా ఓ వ్యక్తి తన ఇంటిపై దాయాది దేశం పాకిస్తాన్ జెండాను ఎగరేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఖుషీనగర్ లో ఈ ఘటన జరిగింది. ఇంటిపై పాకిస్తాన్ జెండా ఎగురుతున్న వీడియో, ఫోటోలు స్థానికంగా వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.

Read Also: Chinese “Spy” Ship: శ్రీలంక బుద్ధి మారలేదు.. భారత్ అభ్యంతరం తెలిపినా చైనా నౌకకు ఆశ్రయం

ఖుషీనగర్లోని బెండుపర్ ముస్తాకిల్ గ్రామానికి చెందిన సల్మాన్ అనే వ్యక్తి తన ఇంటిపై పాకిస్తాన్ జెండాను ఎగరేశాడు. ఇది గమనించిన స్థానికులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన సల్మాన్ ను అరెస్ట్ చేశాని.. అతనిపై అధికారికంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఇలా కొంతమంది జాతి వ్యతిరేక చర్యలకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు.

Show comments