Two test positive for HIV after getting tattoos in Varanasi: శరీరంపై టాటాస్ వేయించుకుంటే ఎంత ప్రమాదమో తెలియజెప్పే ఘటన ఇది. చౌకగా టాటూలు వేస్తున్నారని కక్కుర్తి పడితే.. ఏకంగా జీవితాన్నే పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే సూదితో చాలా మంది టాటూలు వేయించుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. అయితే ఇందులో ప్రస్తుతం ఇద్దరికి ప్రాణాంతకమైన హెచ్ఐవీ వ్యాధి సోకింది. వారణాసిలో చౌకగా వస్తుందని టాటూలు వేయించుకున్నారు. ఆ తరువాత టాటూలు వేయించుకున్న ఇద్దరిలో హెచ్ఐవీ బయటపడింది.
పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రి డాక్టర్ ప్రీతి అగర్వాలో ప్రకారం టాటూలు వేయించుకున్న తరువాత చాలా మంది ఆరోగ్యం క్షీణించిందని.. ఈ కేసులో విచారణ జరుగుతోందిని ఆమె వెల్లడించారు. అయితే టాటూల వల్ల బారాగావ్ కు చెందిన 20 ఏళ్ల యువకుడితో పాటు, నగ్మాకు చెందిన 25 ఏళ్ల మహిళ అస్వస్థతకకు గురయ్యారు. అయితే టాటూల తర్వాత నుంచి వీరిద్దరు జ్వరంతో బాధపడుతున్నారు. వైద్యులు వైరల్ జ్వరం, టైఫాయిడ్, మలేరియాతో పాటు అన్ని రకాల టెస్టులు చేసిన ఫలితం తేలలేదు. అయితే హెచ్ఐవీ టెస్టు చేయగా.. పాజిటివ్ గా తేలింది. రోగులందరికీ హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది.
Read Also: Revanth Reddy: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం.. అందుకే సమావేశం బహిష్కరణ
పూర్తి వివరాలను పరిశీలించిన వైద్యులు రోగులందరికీ ఎలాంటి లైంగిక సంబంధాలు లేవని.. వీరిద్దరిలో కామన్ గా ఉన్న విషయం ఒక టాటూ మాత్రమే. వ్యాధి సోకిన వ్యక్తికి పచ్చబొట్లు వేసిన తర్వాత అదే నిడిల్ తో వీరిద్దరికీ కూడా పచ్చబొట్లు వేయడంతో వీరిద్దరికి కూడా హెచ్ఐవీ సోకినట్లు తేలింది. ప్రస్తుతం వీరిద్దరికీ ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇటీవల టాటూలు వేయించుకున్నవారు హెచ్ఐవీ టెస్టులు చేయించుకోవాలని వైద్యాధికారులు కోరుతున్నారు. పాజిటివ్ గా తేలితే వెంటనే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. టాటూలు వేసే నీడిల్స్ చాలా ఖరీదుగా ఉంటాయి.. అయితే చాలా మంది డబ్బులకు ఆశపడి ఒకే నీడిల్ తో చాలా మందికి టాటూలు వేయడంతో ఇటాంటి వ్యాధులు వస్తాయని చెబుతున్నారు.
