Site icon NTV Telugu

Uttar Pradesh: పోలీసులు అయితే ఏంటి? టీటీతో పెట్టుకుంటే అంతే..!

Tt

Tt

Uttar Pradesh: రైల్వే ఉద్యోగులకు మరికొందరి తప్ప ఎవ్వరైనా సరే టికెట్‌ ఉంటేనే రైలులో ప్రయాణం చేయాలి.. టికెట్‌ లేకుండా రైలు ఎక్కడమే కాదు.. తాము పోలీసులం అంటూ బెదిరింపులకు గురిచేసి.. టికెట్‌ ఉన్నవాళ్లను లేపి.. వారి సీట్లు కూర్చోవడంతో.. సదరు టికెట్‌ కలెక్టర్‌కు చిర్రెత్తుకొచ్చింది.. రైలులో టిక్కెట్‌ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన ఆ పోలీసు బృందానికి తనదైన స్టైల్‌లో వార్నింగ్‌ ఇచ్చేశాడు టీటీ.. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాకు ఎక్కవడంతో వైరల్‌గా మారిపోయింది..

Read Also: India vs Australia ODI: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు అలర్ట్.. ఆఫ్‌లైన్‌లో విశాఖ వన్డే టికెట్లు

యూపీలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పోలీసు బృందం టిక్కెట్‌ లేకుండా ప్రయాణించడమే కాకుండా ప్రయాణికుల సీట్లను ఆక్రమించింది.. ఆ సమయంలో టిక్కెట్‌ కలెక్టర్‌ తనిఖీ చేశారు.. వారిని టిక్కెట్‌ అడగగా.. రివర్స్‌లో బెదిరింపులకు దిగారు. దాదాగిరి చేసే ప్రయత్నం చేశారు. అయితే, డ్యూటీలో ఉన్న టీటీ కూడా ఏమాత్రం తగ్గలేదు.. వారిని ఆయా సీట్ల నుంచి ఖాళీ చేయించాడు. దాదాగిరి చేసేందుకు రైలు ఏమి ఎవరి అబ్బ సొత్తు కాదంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. దీంతో, పోలీసులు సైలెంట్‌ అయిపోయారు.. మొత్తంగా తన డ్యూటీని సక్రమంగా చేసి.. ప్రయాణికులకు న్యాయం చేసిన టికెట్‌ కలెక్టర్‌ (టీటీ) అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.. అయితే.. ఈ వ్యవహారం మొత్తం ఓ ప్రయాణికుడు తన ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాకు ఎక్కించడంతో.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.. ఓవైపు పోలీసులను తిడుతూనే.. మరోవైపు.. టీటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక, ఆ వీడియోపై స్పందించిన రైల్వే పోలీస్ ఫోర్స్: ఈ విషయం ఇప్పటికే అవసరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపించినట్టు చెబుతోంది..

Exit mobile version