Site icon NTV Telugu

UP: భార్యను తుపాకీతో కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం రాశాడంటే..!

Upfire

Upfire

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణంగా జరిగింది. కేన్సర్ బాధితుడు తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్ నివాసి అయిన కుల్దీప్ త్యాగి.. భార్య నిషు త్యాగిని తుపాకీతో కాల్చి చంపి అనంతరం కుల్దీప్ త్యాగి కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడని చెప్పారు. బుధవారం ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Baahubali 1 : ప్రపంచ యాత్రలో మరో ఘట్టానికి చేరుకున్న ‘బాహుబలి’

బాధితుడు సూసైడ్ నోట్‌లో తనకు కేన్సర్ ఉందని.. చికిత్స ఖర్చులు కుటుంబానికి భారంగా ఉండకూడదని సూసైడ్ నోట్‌లో రాసినట్లు తెలిపారు. తన భార్యతో జీవితాంతం కలిసి ఉంటానని మాట ఇచ్చానని.. అందుకే ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నాడు. తనకు కేన్సర్ ఉందని కుటుంబ సభ్యులకు తెలియదని కూడా రాసికొచ్చాడు. కుల్దీప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అయితే కేన్సర్ రోగం మానసికంగా బాగా కలిసి వేసిందని పేర్కొన్నాడు.

ఇక సంఘటన జరిగిన సమయంలో కుల్దీప్ వృద్ధ తండ్రి, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. సూసైడ్ నోట్‌ను బట్టి హత్యా, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మిశ్రా తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించామని.. దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Bhu Bharathi: నేడు భూ భారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Exit mobile version