Communal clashes in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో ఉత్తర్ ప్రదేశ్ లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. యోగీ ఆదిత్యనాథ్ సమర్థవంతంగా ఈ ఆందోళనలను అదుపు చేశారు. అయితే తాజాగా మరోసారి యూపీలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో మాంసం ముక్కలు పడేయడంతో వివాదం రాజుకుంది. ఈ ఘటన యూపీలోని కన్నౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది. దేవాలయాన్ని అపవిత్రం చేశారని.. ఆరోపిస్తూ ఓ వర్గం వారు ఆందోళన చేశారు.
యూపీ కన్నౌజ్ జిల్లా రసూలాబాద్ గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దేవాలంయ ప్రాంగణంలో మాంసం ముక్కలను విసిరేశారు. అంతే కాకుండా రెండు చోట్ల దేవతామూర్తుల విగ్రహాలను అపవిత్రం చేశారు. ఈ ఘటన ఘర్షణలకు కారణం అయింది. అయితే ఈ ఘటనపై ఆలయ పూజారీ జగదీష్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దేవాలయాన్ని శుభ్రం చేయించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు మౌనంగా ఉన్నారని బాధిత వర్గం నిరసన కార్యక్రమాలు చేసింది. తల్గ్రామ్- ఇందర్ ఘర్ రహదారిని దిగ్భందించారు.
Read Also: Uttar Pradesh: యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు సెలవు రద్దు
మూడు గంటల పాలు దిగ్భంధనం కొనసాగింది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు శాంతింపచేశారు. ఈ ఆందోళలు జరిగిన తర్వాత రెండు చోట్ల విగ్రహాలను ధ్వంస చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహం చెందిన ప్రజలు నాలుగు దుకాణాలను తగలబెట్టారు. స్మశాన వాటికను ధ్వంసం చేశారు. దీంతో జిల్లా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. శనివారం సాయంత్రం కాన్పూర్ ఐజీ ప్రశాంత్ కుమార్ , కాన్పూర్ కమిషనర్ రాజ్ శేఖర్ తాల్గ్రామ్ చేరుకుని.. విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
