NTV Telugu Site icon

Joe Biden: భారతీయులకు అండగా ఉంటాం.. మోర్బీ వంతెన ఘటనపై బైడెన్ సంతాపం

Joe Biden

Joe Biden

US President Joe Biden condoles loss of lives at Morbi bridge collapse: గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనలో 141 మంది మరణించారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు మరణించడం అందర్ని కలిచివేస్తోంది. దీపావళి సెలువులు కావడం, వారాంతం కావడంతో మచ్చు నదీ అందాలను తిలకించేందుకు వచ్చిన చాలా మంది ఈ ప్రమాదం బారిన పడ్డారు.

ఇదిలా ఉంటే మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సోమవారం సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మేము భారతీయులకు అండగా ఉంటామని మద్దతు ఇచ్చారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మా హృదయాలు భారతదేశంతో ఉన్నాయని.. గుజరాత్ ప్రజలతో కలిసి సంతాపాన్ని తెలియజేస్తున్నాం అని ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, భారత్ ప్రజల మధ్య మంచి బంధాలు ఉన్నాయని.. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలకు మద్దతుగా నిలుస్తామని ట్వీట్ చేశారు.

Read Also: Manjima Mohan: అఫీషియల్.. తమిళ హీరోతో నాగచైతన్య హీరోయిన్ ప్రేమాయణం

మరమ్మతలు జరిగిన ఐదు రోజులకే బ్రిడ్జ్ కూలిపోవడంపై గుజరాత్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు కారణం అని భావిస్తున్న 9 మందిని అరెస్ట్ చేసింది. దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసింది. కేవలం 150 లోపు మంది సామర్థ్యాన్ని కలిగి ఉన్న వంతెనపైకి ఒక్కసారిగా 500 మంది వరకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, లోకల్ అధికారులు కలిసి చాలా వందల మందిని కాపాడారు. అయినా కూడా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే మరణించిన వారి సంఖ్య 141కి చేరుకుంది.