డాలర్లు సంపాదించేందుకు అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన వారికి గట్టి షాక్ తగులుతోంది. డొలాల్డ్ ట్రంప్ అధ్యక్ష భాద్యతలు చేపట్టిన వెంటనే తన మార్క్ పాలన చూపిస్తూ దూసుకెళ్తున్నాడు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది అమెరికా ప్రభుత్వం. యూఎస్ లో అక్రమంగా ఉంటున్న భారతీయులను సైతం వెనక్కి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది భారతీయులను వెనక్కి పంపింది. 205 మంది భారతీయులను వెనక్కి పంపించింది.
టెక్సాస్ నుంచి బయల్దేరిన ఆ విమానం బుధవారం మధ్యాహ్నం అమృత్ సర్ లో ల్యాండ్ అయ్యింది. పంజాబ్ పోలీసుల గట్టి భద్రత మధ్య విమానం శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. 205 మందిని అధికార యంత్రాంగం అదుపులోకి తీసుకుని వారి డాక్యుమెంట్స్ ను తనిఖీ చేసి స్వస్థలాలకు పంపించనున్నారు.