Site icon NTV Telugu

US Student Visas: అమెరికా స్టూడెంట్ వీసాల్లో ఇండియా రికార్డు.. ప్రపంచంలో మనమే ఫస్ట్

Usa Student Visa

Usa Student Visa

US issues 82,000 student visas to Indians in 2022: భారతదేశం నుంచి ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. మెరుగైన విద్య, అవకాశాల కోసం భారతీయులు అమెరికా వైపు చూస్తున్నారు. ప్రపంచంలో భారతీయ విద్యార్థులు వెళ్లే విదేశాల్లో అమెరికా తర్వాతనే ఇతర దేశాలు ఉన్నాయి. కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటివి అమెరికా తర్వాతనే ఉన్నాయి. తాజాగా ఈ విషయాన్ని రుజువుచేస్తూ రికార్డు స్థాయిలో ఈ ఏడాది వీసాలను జారీ చేసింది అమెరికా.

భారతదేశంలో ఉన్న కాన్సులేట్ల ద్వారా 2022లో ఇప్పటి వరు 82,000 స్టూడెంట్ వీసాలు జారీ అయ్యాయి. ఇది మునపటి ఏడాది కన్నా చాలా ఎక్కువ. ప్రపంచంలో ఇతర దేశాల కన్నా భారతీయ విద్యార్థులే ఎక్కువ స్టూడెంట్ వీసాలను పొందారు. న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలోని కాన్సులేట్లు మే నుంచి ఆగస్టు వరకు స్టూడెంట్ వీసాల ప్రాసెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. వీలైనంత ఎక్కువ మంది స్టూడెంట్స్ వారి క్లాసెస్ ప్రారంభానికి ముందే చేరుకునేలా చేశామని యూఎస్ రాయబార కార్యాలయం ప్రకటించింది.

Read Also: Tagore Scene Repeat In Telangana: ఠాగూర్ సీన్ రిపీట్.. చనిపోయిన మహిళకు చికిత్స

ఈ వేసవిలోనే 82,000 స్టూడెంట్ వీసాలు జారీ చేశామని.. ఇది మునపటి ఏడాది కన్నా ఎక్కువ అని.. ఇది భారతీయులు ఉన్నత విద్య కోసం ఎక్కువగా వెళ్లే దేశాల్లో అమెరికా ఉందని ఇది చూపిస్తుందని భారత్ లోని యూఎస్ సీనియర్ దౌత్యవేత్త చార్జ్ డి అఫైర్స్ ప్యాట్రిసియా లాసినా అన్నారు. గతంలో కోవిడ్ -19 కారణంగా ఆలస్యం జరిగిందని.. ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు వీసాలు పొందడం.. గడువులోగా వారి యూనివర్సిటీలకు చేరుకోవడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కొనసాగించడం.. రెండు దేశాలకు భారతీయ విద్యార్థులు అందించే సహాకారాన్ని ఇది పెంపొందిస్తుందని ఆమె అన్నారు. కాన్సులర్ వ్యవహారాల మంత్రి కౌన్సిలర్ డాన్ హెప్లిన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ విద్యార్థుల చైతన్యం యూఎస్ దౌత్యానికి ప్రధానమైనదని అన్నారు.

2020-21 విద్యా సంవత్సరంలో భారతదేశం నుంచి 1,67,582 మంది విద్యార్థులు ఉన్నట్లు ‘ఓపెన్ డోర్స్’ నివేదిక 2021లో వెల్లడించింది. యూఎస్ఏలో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతదేశానికి చెందిన విద్యార్థులే 20 శాతం మంది ఉన్నారు.

Exit mobile version