Site icon NTV Telugu

Pakistan: పాకిస్తాన్‌కు అమెరికా భారీ ఆర్థిక సాయం

Pakistan Floods

Pakistan Floods

US flood aid to Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ కు మరోసారి భారీ ఆర్థిక సాయం చేసింది అమెరికా. వరదలతో అతలాకుతలం అయిన పాకిస్తాన్ ను ఆదుకునేందుకు 100 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునర్నిర్మాణం, వ్యాధులు ప్రభలకుండా, ఆర్థిక వృద్ధి, ఆహారం కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు. మానవతా సాయం కింద పాకిస్తాన్ కు నిధులు ఇస్తున్నట్లు యూఎస్ విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. గతంలోొ కూడా వరద సాయం కింద పాకిస్తాన్ కు 100 మిలియన్ డాలర్లను అందించింది యూస్. దీంతో మొత్తంగా 200 మిలియన్ డాలర్లను వరదసాయం కింద అందించింది.

Read Also: Temperature Dropped: వణికిస్తున్న చలి.. రికార్డు స్థాయిలో పడిపోతున ఉష్ణోగ్రతలు

పాకిస్తాన్ పునరుద్ధరణ, పునర్నిర్మాణం కోసం రాబోయే కాలంలో నిరంతరం తోడ్పాటు అందిస్తామని.. వాతావరణాన్ని తట్టుకోగల భవిష్యత్తును నిర్మించడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని నెడ్ ప్రైస్ వెల్లడించారు. వరద విలయం నుంచి కోలుకోవడానికి పాకిస్తాన్ కు 16.3 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వాతావరణంపై నిర్వహించిన సదస్సులో చెప్పారు. ఇందులో సగం విదేశాల నుంచి వస్తాయని ఆయన భావిస్తున్నారు.

గతేడాది అక్టోబర్ లో పాకిస్తాన్ ను వరదలు ముంచెత్తాయి. మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ లేని విధంగా అక్కడ వరదలు సంభవించాయి. ఏకంగా మూడొంతుల భూభాగం వరదల్లో చిక్కుకుంది. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ అక్కడ వ్యవసాయ భూములు పంటలకు పనికి రాకుండానే ఉన్నాయి. ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరదల వల్ల 1,739 మంది చనిపోయారు. 3.3 కోట్ల మంది ప్రజలు ప్రభావితం అయ్యారు.

Exit mobile version