Site icon NTV Telugu

Tamil Nadu: బావతో పెళ్లికి కుటుంబం ససేమిరా.. యువతి ఆత్మహత్య..

Tamil Nadu Incident

Tamil Nadu Incident

Upset over not being allowed to marry her cousin, college girl kills self in TN’s Cuddalore: తమిళనాడు రాష్ట్రం కడలూరులో విషాద సంఘటన జరిగింది. తన మేనమామ కొడుకుని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కడలూరులో ఓ కాలేజీ చదువుకుంటున్న యువతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. తన బావతో వెంటనే పెళ్లి చేయాలని యువతి కోరింది. అయితే చదువు ముగిసిన తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబ సభ్యులు చెప్పినా.. వినిపించుకోకుండా తనువు చాలించింది.

Read Also: Lovers Crime News: మూడేళ్ల క్రితమే యువతికి పెళ్లి.. ప్రియుడి కోసం ఆ పని

మేనమామ కుమారుడితో పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన కృతిక అనే యువతి కడలూరు జిల్లా చిదంబరం టౌన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని 19 ఏళ్ల కృతికగా గుర్తించారు. మృతురాలు బీకాం చివరి సంవత్సరం చదువుతోంది. మేనమామ కుమారుడిని పెళ్లి చేసుకుంటానని గత ఆరు నెలలుగా కుటుంబ సభ్యులను కోరుతోంది. అయితే అందుకు కుటుంబ సభ్యలు ససేమిరా అన్నారు. చదువు పూర్తయ్యాకే పెళ్లి చేస్తామని తెలిపారు.

ఈ క్రమంలో మంగళవారం చిదంబరం పట్టణంలో కోచింగ్ క్లాసుకు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో వల్లంపుగుడై రైల్వే స్టేషన్ లో యువతి తన బావతో మాట్లాడింది. కొంత సమయం తరువాత తిరుచందూర్ కు వెళ్తున్న రైలు ముందు బాలిక దూకిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రైలు తాకిడికి కృతిక శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version