NTV Telugu Site icon

UPSC Tutor: శ్రీరాముడిని అక్బర్‌తో పోల్చిన ట్యూటర్.. విమర్శల దాడితో క్షమాపణలు..

Upsc Tutor Shubhra Ranjan

Upsc Tutor Shubhra Ranjan

UPSC Tutor: ప్రముఖ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ట్యూట్యర్ శుభ్ర రంజన్ వివాదంలో ఇరుక్కున్నారు. శ్రీరాముడిని మొఘల్ చక్రవర్తి అక్బర్‌తో పోల్చడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాముడని అక్బర్‌తో పోల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు..? అయితే, విమర్శలు దాడి ఎక్కువ కావడంతో శుభ్ర రంజన్ క్షమాపణలు చెబుతూ నోట్ విడుదల చేశారు.

యూపీఎస్‌సీ సీఎస్‌ఈ కోచ్ శుభ్రరంజన్ క్లాసు చెబుతూ.. మొఘల్ చక్రవర్తి అక్బర్, రాముడి కంటే శక్తివంతమైనవాడు అని హిందువుల మనోభావాలను కించపరిచినట్లు పలువరు ఆరోపణలు చేశారు. ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ తాను సైబర్ పోలీస్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఆమె దూషణలు హిందూ మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆరోపించారు.

Read Also: MP Shocker: చెల్లిపై అత్యాచారం, తల్లి ముందే హత్య.. ఎంపీ ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు..

విమర్శలు ఎదురవ్వడంతో శుభ్ర రంజన్ తన క్లాసు గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైరల్ అవుతున్న వీడియో తన క్లాసులోని చిన్న భాగం మాత్రమే అని చెప్పారు. ‘‘ ప్రభు శ్రీరాముడి రాజ్యం ఆదర్శవంతమైన రాజ్యం అని నేను తెలియజేయాలనుకుంటున్నాను అని పూర్తి వీడియో ఉపన్యాసం చూడటం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు’’ అని ఆమె అన్నారు. కాంపిటేటివ్ స్టడీలో ఇది భాగమని, ఏదైనా తప్పుగా వ్యాఖ్యానించినందుకు చింతిస్తున్నానని ఆమె చెప్పారు.

ఇదిలా ఉంటే ఆమె శ్రీరాముడిని అక్బర్‌తో పోల్చి యూపీఎస్‌సీ అభ్యర్థుల మనసుల్ని భ్రష్టుపట్టించారని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని మరో నెటిజన్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అక్బర్‌ని శ్రీరాముడితో పోలిస్తే తప్పేంటి..? అని ప్రశ్నిస్తున్నారు. ‘‘భగవాన్ ప్రభు శ్రీ రామ్ భారతదేశం యొక్క అత్యుత్తమ ఆధ్యాత్మిక వారసత్వం, నాగరికత మరియు సాంస్కృతిక చరిత్రను సూచిస్తుంది. ప్రభు శ్రీరామునిపై మరియు ఆయన చూపిన మార్గంపై మాకు అత్యంత గౌరవం మరియు విశ్వాసం ఉన్నాయి. ఒక సంస్థగా, మేము మరియు మా సభ్యులందరూ అన్ని మతాల పట్ల గౌరవం కలిగి ఉన్నాము. ” అని ఆమె చెప్పారు.