Site icon NTV Telugu

UPSC Aspirant Suicide: వైఫల్యాల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న సివిల్స్ అభ్యర్థి..

Upsc Aspirant Suicide

Upsc Aspirant Suicide

UPSC Aspirant Suicide: ‘‘ఎవరూ ఐఏఎస్ ఊరికే అవరు. ఇప్పుడే మీరు నిద్ర నుంచి మేల్కొని చదవాలి’’ అంటూ గది గోడలపై ఎన్నో ఇలాంటి మోటివేషనల్ కోట్స్ ఉన్నాయి. అయినా కూడా, పదే పదే వైఫల్యాల కారణంగా, ఒత్తిడిని ఎదుర్కోలేక ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్‌కి చెందిన ఆశా ఉయ్కే(25) తన జీవితాన్ని ముగించింది.

Read Also: Mangaluru: కర్ణాటకలో ఉద్రిక్తత.. సుహాస్ శెట్టి తర్వాత మసీద్ సెక్రటరీ దారుణహత్య..

ఆశా ఇండోర్‌లోని హీరా నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె యూపీఎస్‌సీ పరీక్షలకు సిద్ధమవుతోంది. కానీ పదే పదే వైఫల్యాలు ఎదురైన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కుంటోందని తెలుసుకున్న తల్లి ఆమె వద్దకు వెళ్లాలనుకుంది. ఆలోపే ఉశా సూసైడ్ చేసుకుంది. తల్లిదండ్రుల నుంచి ఫోన్ కాల్స్‌కి సమాధానం ఇవ్వకపోవడంతో, ఇంటి యజమానిని సంప్రదించగా, ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది.

తన ఎక్స్‌ర్‌సైజ్ బుక్‌తో తల్లిదండ్రుల్ని, బంధువుల్ని క్షమించాలని కోరుతూ, అనేక మోటివేషనల్ కోట్స్ రాసింది. ఆమె తనలో తాను ఉత్సాహాన్ని పెంచుకోవడానికి ఇలా కోట్స్ రాస్తుందని పోలీసులు తెలిపారు.

Exit mobile version