Site icon NTV Telugu

Uttar Pradesh: భర్తతో షాపింగ్‌కి వెళ్లింది.. ఆ తర్వాత బావతో జంప్

Meerut

Meerut

Uttar Pradesh: ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు, అనాలోచిత నిర్ణయాలు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. చాలా వరకు ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ హత్యలతో ముగుస్తున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు, పురుషులు ఇలాంటి పనులకు పాల్పడి పచ్చని కాపురాలు విడిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా చాలానే జరిగాయి.

తాజాగా ఓ భార్య తన భర్తతో షాపింగ్‌కి వెళ్లి, అక్కడ నుంచి బావతో లేచిపోయింది. యూపీలోని మీరట్ లో ఈ ఘటన జరిగింది. మహిళ తన భర్తతో కలిసి కార్వా చౌత్ కోసం షాపించ్ చేసిన కొన్ని గంటల తర్వాత బావతో జంప్ అయింది. ఈ ఘటన తర్వాత భర్త తన భార్య, తన పిల్లల ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆశ్రయించాడు.

Read Also: Mahua Moitra: దుబాయ్ నుంచి 47 సార్లు లాగిన్.. మహువా మోయిత్రా కేసులో కీలక విషయాలు..

మీరట్‌లోని జానీ ప్రాంతంలో అశోక్, ప్రియలకు 2019లో వివాహం జరిగింది. వివాహం తర్వాత వీరిద్దరు సంతోషంగానే ఉన్నారు. వీరికి 18 నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అశోక్ మంగళవారం నాడు మీరట్ ఎస్పీ ఆఫీసుకు చేరుకుని.. తన భార్య, ఆమె బావ రాహుల్‌‌తో కలిసి పారిపోయిందని ఫిర్యాదు చేశాడు. రాహుల్ తమ ఇంటికి వచ్చి, తన భార్య, పిల్లలను తీసుకుని వెళ్లాడని పోలీసులు చెప్పాడు. కర్వా చౌత్ కోసం తన భార్యను షాపింగ్ కి కూడా తీసుకెళ్లానని, తన భార్య రూ. 15 వేల విలువైన అభరణాలు కూడా తీసుకుని పారిపోయిందని తెలిపాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతునున్నారు.

ఉత్తర భారతదేశంలో వివాహిత స్త్రీలు జరుపుకునే పండుగ అయిన కర్వా చౌత్. భర్తల శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం భార్యలు పగటిపూట ఉపవాసం ఉంటారు. స్త్రీలు పండుగ వేషధారణలో అలంకరించుకుని, చేతులకు గోరింట పెట్టుకుని, పూజలు చేస్తారు. ఇంత ముఖ్యమైన వేడుక జరిగిన వెంటనే భార్య తన భర్తను విడిచిపెట్టడం చాలా మందిని షాక్ కి గురిచేసింది.

Exit mobile version