Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణంలో ఇటీవల పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది. సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వేకి వచ్చిన అధికారులపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడి చేసింది, కొందరు గన్ ఫైర్ చేశారు. స్థానికంగా ఉన్న ఇళ్లను ధ్వంసం చేసి, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఈ హింసపై మొత్తం 07 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. స్థానిక సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే కొడుకుపై కూడా కేసులు నమోదయ్యాయి.
ఇదిల ఉంటే, నవంబర్ 24న జరిగిన హింసాకాండలో పోలీసులకు మద్దతుగా మాట్లాడినందుకు ఒక మహిళకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. హింస సమయంలో రాళ్ల దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకునే హక్కు పోలీసులకు ఉందని మహిళ వాదించింది. దీంతో తన భర్త తనను ‘‘కాఫిర్(అవిశ్వాసకురాలు)’’ అని పిలిచినట్లు నిదా అనే మహిళ పేర్కొంది. ‘‘నేను ఒక పనిపై సంభాల్ వెళ్లే ముందు అక్కడి పరిస్థితి బాగానే ఉందో లేదో తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌కి వెళ్లి చూశానని, నా భర్త నన్ను వీడియోలు చూడనివ్వలేదు. ఘర్షణల తర్వాత పోలీసుల చర్యల్ని వ్యతిరేకిచాడు. పోలీసులు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని చెప్పినప్పుడు తనను తిట్టడం ఆరంభించినట్లు చెప్పారు’’ అని ఆమె చెప్పారు.
Read Also: Aaditya Thackeray: సమాజ్‌వాదీ నేత ‘‘బీజేపీకి బీ-టీమ్’’..
అతను తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చినట్లు ఆమె చెప్పింది. తన భర్త చిన్నచిన్న విషయాలపై తనతో వాగ్వాదానికి దిగుతున్నాడని, కుటుంబాన్ని చూసుకోవడం లేదని నిదా ఆరోపించారు. తనకు నలుగురు పిల్లలు ఉన్నారని, 5 నెలల చిన్న పిల్లకు బాగోలేదని, అతను చూసుకోవడం లేదని అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ట్రిపుల్ తలాక్‌తో పాటు కుమార్తెపై తన భర్త లైంగిక వేదింపులకు పాల్పడినట్లు నిదా లాయర్ ఆరోపించారు. కోర్టుని ఆశ్రయిస్తామని చెప్పారు. నిదా అత్తమామలు కూడా ట్రిపుల్ తలాక్‌కి మద్దతు ఇస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు.
నవంబర్ 24న సంభాల్‌లో మసీదు సమీపంలో ఘర్షణ జరిగింది. ఈ మసీదు ప్రాచీన హరిహర్ మందరిమని హిందూ పక్షం కోర్టుని ఆశ్రయించింది. మొఘల్ పాలకుడు బాబర్ సమయంలో ఈ ఆలయాన్ని కూల్చేసి, మసీదు నిర్మించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు మసీదు సర్వేకి ఆర్డర్ ఇచ్చింది. సర్వే జరుగే రోజు పెద్ద ఎత్తున హింస చెలరేగింది.