NTV Telugu Site icon

HIV-positive: “నిత్య పెళ్లికూతురి”కి హెచ్ఐవీ పాజిటివ్.. అధికారుల ఉరుకులు పరుగులు..

Up

Up

HIV-positive: ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల పోలీసులకు, ఇతర అధికారులకు కొత్త కష్టం వచ్చిపడింది. యువకులను మోసం చేస్తూ పదుల సంఖ్యలో వివాహాలు చేసుకుంటున్న ఓ ‘‘నిత్య పెళ్లికూతురి’’ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదులో మహిళను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు ఆమె పెళ్లిళ్ల గురించి అధికారులు పెద్దగా వర్రీ అవ్వడం లేదు, కానీ ఆమెకు పరీక్షల్లో ‘‘హెచ్ఐవీ’’ పాజిటివ్ అని తెలుసుకుని ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు.

జైలుకు తరలించే సమయంలో పరీక్షలు నిర్వహించడంతో మహిళకు హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. ఈమె వలలో ఎంత మంది పురుషులు ఉన్నారు..? ఎంత మందితో శారీరక సంబంధం పెట్టుకుంది..? అనే వివరాల కోసం అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నకిలీ వివాహాల ద్వారా అనేక మంది యువకులను మోసం చేసినట్లు విచారణలో తేలింది. పెళ్లి చేసుకుని నగదు, నగలతో పరారయ్యేది. ఈమెను పెళ్లి చేసుకున్న వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. మే 6న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ, ఉత్తరాఖండ్ అంతటా ఇలా నకిలీ పెళ్లిళ్లు నిర్వహిస్తున్న గ్యాంగ్‌లో నిందితురాలు సభ్యురాలిగా తేలింది. ఇందులో మొత్తం ఆరుగులు సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం వీరందర్ని ముజఫర్‌నగర్ జైలులో ఖైదు చేశారు.

Read Also: UP: యూపీలో దారుణం.. కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి

జిల్లా ఆస్పత్రి వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్‌ఐవీగా తేలింది. ఈమెతో శారీరక సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను ఉత్తరాఖండ్‌లో గుర్తించారు. వీరందరికి కూడా హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. వ్యాధి సోకిన కుటుంబీకులను కూడా అధికారులు పరీక్షిస్తున్నారు. యూపీ లోని ముజఫర్‌నగర్ ఇతర ప్రాంతాల్లో ఈమె బారినపడిన వరుల కోసం అధికారులు వెతుకుతున్నారు. నిందితురాలు ఉత్తరాఖండ్ లోని యుఎస్ నగర్ జిల్లాలకు చెందిన వారిగా తేలింది. ఈ ముఠాలోని వ్యక్తులు మహిళ బంధువులుగా నటిస్తూ పెళ్లిళ్లు జరిపించేవారు. ఉత్తరాఖండ్‌లో మూడింటితో పాటు మొత్తం ఐదు వివాహాలు చేసుకున్నట్లు మహిళ విచారణలో అంగీకరించింది. ప్రస్తుతం ఈమెకు యాంటీరెట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) చికిత్సని ఇస్తున్నారు.

Show comments