NTV Telugu Site icon

UP: క్లాస్‌రూంలో పోర్న్ చూస్తున్న టీచర్..పట్టుకున్న స్టూడెంట్‌పై దాడి..

Up

Up

UP: ఉత్తర్ ప్రదేశ్‌లో ఝాన్సీలో ఓ ఉపాధ్యాయుడు స్టూడెంట్‌ని చితకబాదాడు. ప్రైవేట్ స్కూట్ టీచర్ క్లాస్ రూపంలో పోర్న్ వీడియోలు చూడటాన్ని చూసిన విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుల్దీప్ యాదవ్ అనే టీచర్ క్లాస్‌ రూంలో అసభ్యమైన కంటెంట్ చూస్తున్నాడని గుర్తించిన విద్యార్థులు అతడిని చూసి నవ్వారు. దీంతో ఆగ్రహించిన అతను బాలుడిని కొట్టాడు.

Read Also: Jailer 2 : తూచ్ అంతా ఉత్తిదే.. జైలర్ 2 ఆ బ్యూటీ లేదట

‘‘టీచర్ నా కొడుకు జట్టు పట్టుకుని తలను గోడకు బాదాడు. దీంతో చెవికి గాయాలు అయ్యాయి. టీచర్ అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు కర్రతో కొట్టాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను.’’ అని పిల్లాడి తండ్రి జై ప్రకాష్ చెప్పారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

జిల్లా ఎస్పీ గోపీనాథ్ సోనీ మాట్లాడుతూ..ఒక పాఠశాలలో దాడి కేసు వెలుగులోకి వచ్చింది, దీనిలో 8 ఏళ్ల పిల్లవాడిని అతని క్లాస్ టీచర్ కొట్టాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు టీచర్‌ని అదుపులోకి తీసుకున్నాం. టీచర్ క్లాస్‌రూమ్‌లో పోర్న్ చూస్తుండగా పట్టుకున్న విద్యార్థిని కొట్టాడని చెప్పారు. తండ్రి ఫిర్యాదు మేరకు టీచర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Show comments