Wedding: మరికాసేపట్లో పెళ్లి, బంధుమిత్రులతో వివాహ వేదిక కలకలలాడుతోంది. ఆ సమయంలోనే వరుడికి వధువు లవర్ ఫోన్ చేశాడు. దీంతో వరుడు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగింది. వధువు పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించుకున్నారు. అయితే, ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయింది. మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనే సమయంలో వధువు లవర్ ఫోన్ చేసి, తాము ఇద్దరం ప్రేమించుకున్నామని ఆమెను పెళ్లి చేసుకోవద్దని బెదిరించాడు. ఇదే కాకుండా, దీనికి రుజువు కోసం వధువుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను పంపాడు. దీంతో పెళ్లికి వెళ్లేందుకు వరుడు నిరాకరించాడు. ప్రియుడిగా చెప్పబడుతున్న కమల్ సింగ్ అనే వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Read Also: Assam: వర్షం కారణంగా రాకపోకలు బంద్..చెల్లి మృతదేహాన్ని 5కి.మీ మోసుకెళ్లిన సోదరులు
నివేదికల ప్రకారం.. వరుడు పెళ్లి చేసుకోవాల్సిన వధువు పెళ్లి ఊరేగింపుతో ఆడమ్‌పూర్‌కి వచ్చింది. వివాహానికి హాజరైన వారంతా భోజనాలు ముగించారు. ఇక ఏడు అడుగులు నడవాల్సిన ఘట్టమే మిగిలి ఉంది. అప్పుడే సరిగ్గా వరుడికి మొబైల్‌కి ఫోన్ వచ్చింది. అటువైపు ఉన్న వ్యక్తి తనను తాను కమల్ సింగ్‌గా చెప్పుకుని, తాను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ప్రేమికులమని, ఆమెను పెళ్లి చేసుకోవద్దని కోరాడు. కమల్ సింగ్ రుజువుల కోసం వధువుతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను పంపాడు. ఇందులో కొన్ని వారిద్దరు హోటల్ గదిలో ఉన్నవి కూడా ఉన్నాయి. కొన్ని వీడియోలు వారు ఇద్దరు ఏకాంతంగా గడిపిన దృశ్యాలు ఉన్నాయి. వీటిన్నింటిని చూసిన వరుడు పెల్లిన క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.