UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- యూపీలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు
- 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ
- కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల(రెండేళ్ల కొకసారి) కోసం భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది. ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాశ్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శ్రుతి గంగ్వార్‌లను పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసింది. అయితే ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి మాత్రం ఈసారి చోటు దక్కలేదు. ఆయనతో పాటు మరో కేంద్ర మంత్రి బీఎల్ వర్మను కూడా పార్టీ మళ్లీ నామినేట్ చేయలేదు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు వారి పదవీకాలం ముగుస్తుండడంతో సోమవారం కొత్త జాబితాను ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ కానున్న 10 రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 16న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని బట్టి పలు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలుకు గడువు అక్టోబర్ 6తో ముగియనుంది. బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించగా.. సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే రామ్ గోపాల్ యాదవ్, ధన్‌రాజ్ నత్వానీలను అభ్యర్థులుగా ప్రకటించింది. మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దింపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
అసెంబ్లీలో ప్రస్తుతం ఎన్డీఏకు 289 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో బీజేపీ నుంచి 256 మంది, అప్నా దళ్ (ఎస్) నుంచి 13 మంది, నిషాద్ పార్టీ నుంచి ఐదుగురు, ఆర్ఎల్డీ నుంచి తొమ్మిది మంది, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) నుంచి ఆరుగురు ఉన్నారు. బీజేపీకి ఇద్దరు జనసత్తా దళ్ (లోక్తాంత్రిక్) ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర సభ్యుల మద్దతు కూడా లభించే అవకాశం ఉంది, దీంతో ఎన్డీఏ వాస్తవ బలం 294కు చేరుతుంది. ఈ బలంతో ఎనిమిదవ అభ్యర్థి విజయాన్ని ఖాయం చేసుకోవడానికి ఎన్డీఏకు కేవలం మరో రెండు ఓట్లు మాత్రమే అవసరం ఉంటుంది. ఎన్నికల సమయానికి ఎవరైనా మద్దతు ఇస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!