NTV Telugu Site icon

UP: పోస్టాఫీస్‌పై సీబీఐ రైడ్స్.. తుపాకీతో కాల్చుకుని ఆఫీసర్ ఆత్మహత్య

Upcbirides

Upcbirides

ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీబీఐ రైడ్స్‌కు భయపడి పోస్టాఫీస్ ఆఫీసర్ త్రిభువన్ ప్రతాప్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో లైసెన్స్ పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా రాసిన సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Komati Reddy Venkata Reddy: నేను కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్ ను చూసి వచ్చా..!

బులంద్‌షహర్‌లోని ప్రధాన పోస్టాఫీసులో కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయంటూ మంగళవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పోస్టాఫీసుపై దాడి చేసింది. రిటైర్డ్ ఫీల్డ్ ఆఫీసర్ సహా ఎనిమిది మందికి పైగా ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సూపరింటెండెంట్ త్రిభువన్ ప్రతాప్ సింగ్‌ను సీబీఐ విచారించింది. అయితే కొన్ని గంటల్లోనే ఆయన తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సహోద్యోగులపై ఆరోపణలు చేస్తూ సూసైడ్ నోట్ రాశారు. సీబీఐ అధికారుల ఒత్తిడి కారణంగానే ప్రతాప్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఖండించారు. తమ ఆదేశాల ప్రకారం పని చేయాలంటూ ఒక మహిళ, కొందరు అధికారులు బలవంతం చేస్తున్నట్లు ప్రతాప్ సింగ్ ఆరోపించారు. ఆఫీసు వాట్సాప్ గ్రూప్‌లో ఆయన పోస్ట్‌ చేసిన సూసైడ్ నోట్‌ను పోలీసులకు షేర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ నోట్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: కన్నయ్యనాయుడిని సన్మానించిన సీఎం చంద్రబాబు