Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దొంగతనం చేశాడనే అనుమానంతో స్థానికులు ముస్లిం వ్యక్తిని చెట్టుకట్టేసి కొట్టారు. అంతటితో ఆగకుండా గుండు కొట్టించి, జై శ్రీరామ్ నినాదాలు చేయాలని బలవంతం చేశారు. ఈ ఘటన యూపీలోని బులంద్ షహర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో నినాదాలు చేయాలని కొట్టిన ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత తన కుమారుడిని జైలుకు పంపారని బాధితుడు సాహిల్ తండ్రి షకీల్ ఆరోపించారు. నిందితుడితో రాజీ కుదుర్చుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Indian Student Rape: యూకేలో ఓ మహిళపై భారతీయ విద్యార్థి అత్యాచారం.. 6 ఏళ్ల జైలుశిక్ష..!
ఉత్తర్ ప్రదేశ్ లో ఈ ఘటన రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ వీడియోను ట్వీట్ చేశారు. యూపీ పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్దారు. పోలీసులు నిందితుడికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా, సాహిల్ ను జైలుకు పంపారని, అన్యాయానికరి వ్యతిరేకంగా మేము ఎక్కడి వెళ్లాము అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.
వీడియో ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ ఎస్పీ సురేంద్ర నాథ్ తివారీ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితులను గజేంద్ర, సౌరభ్, ధన్నీలుగా పోలీసులు గుర్తించారు. తన కొడుకు బోభజనాకి ఇంటికి వెళ్తుండగా.. నిందితులు చెట్టుకు కట్టేసి కొట్టారని బాధితుడు సాహిల్ తండ్రి షకీల్ ఆరోపించారు. మా కొడుకును జైలుకు పంపారు, నిందితులతో రాజీ కుదుర్చుకోవాలని పోలీసులు చెబుతున్నారని, భయపెడుతున్నారని, మాకు న్యాయం కావాలని షకీల్ ఆవేదన వ్యక్తం చేశారు.
