NTV Telugu Site icon

Uttar Pradesh: అబ్బాయిగా నిద్రపోయి, అమ్మాయిగా లేచాడు.. తెలియకుండా లింగమార్పిడి..

Surgery

Surgery

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. ఒక పురుషుడికి బలవంతంగా ‘‘లింగమార్పిడి’’ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని ముజఫర్‌నగర్‌లోని స్థానిక వైద్య కళాశాలకు చెందిన వైద్యులు, మరో వ్యక్తితో కుమ్మక్కై బాధితుడికి ఇలా సర్జరీ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ కేసు భారతీయ కిసాన్ యూనియర్(బీకేయూ) నిరసనలకు దారి తీసింది. మన్సూర్‌పూర్ లోని బేగ్‌రాజ్‌పూర్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిని సంజక్ గ్రామ నివాసి ముజాహిద్‌గా గుర్తించారు. తాను ఓం ప్రకాష్ చేతిలో మోసపోయానని ఆరోపించారు. ఓం ప్రకాష్, ముజాహిద్‌కి శస్త్రచికిత్స చేయాలని వైద్య కళాశాలలో వైద్యులను ఒప్పి్ంచాడని, తన జననాంగాలను తొలగించి బలవంతంగా లింగ మార్పిడి చేయించాడని ఆరోపించారు.

Read Also: JBL Live Beam 3 Price: జేబీఎల్‌ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్‌.. 48 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌!

గత రెండేళ్లుగా ఓం ప్రకాష్ తనను బెదిరిస్తూ వేధిస్తున్నాడని ముజాహిద్ పేర్కొన్నాడు. ముజాహిద్‌కి వైద్యపరమైన సమస్య ఉందని చెప్పి ప్రకాష్ అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆస్పత్రి సిబ్బంది మత్తుమందు ఇచ్చి లింగమార్పిడి చేసినట్లు బాధితుడు వాపోయాడు. ‘‘ అతను నన్ను ఇంటికి తీసుకువచ్చిన ఒక రోజు తర్వాత స్పృహలోకి వచ్చాను. నేను అబ్బాయి నుంచి అమ్మాయిగా మార్చబడ్డాను’’ అని ముజాహిద్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. ఇప్పుడు తనతో కలిసి జీవించాల్సి ఉంటుందని ఓం ప్రకాష్ తనతో చెప్పాడని, సమాజం, తన కుటుంబం ఎవరూ నన్ను అంగీకరించాడని చెప్పాడని ముజాహిద్ చెప్పాడు. ఇదే కాకుండా తన తండ్రిని చంపుతానని, తన కుటుంబానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకుంటానని బెదిరించాడని ఆరోపించాడు.

మగవాడి నుంచి అమ్మాయిలా మార్చానని, తనతోనే జీవించాలని, కోర్టు మ్యారేజ్ కోసం న్యాయవాదిని సిద్ధం చేసినట్లు ఓం ప్రకాష్ చెప్పడాని ముజాహిద్ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన బీకేయూ కార్మికులు ఓంప్రకాష్‌పైనా, సంబంధిత వైద్యులపైనా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు నాయకుడు శ్యామ్‌పాల్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీ వద్ద నిరసనకు దిగారు. సమగ్ర విచారణ జరిపిస్తామని పోలీసులు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. ఆస్పత్రి అక్రమ అవయవాల వ్యాపారానికి కేంద్రంగా మారిందని, లింగమార్పిడి సర్జరీలు చేస్తున్నాంటూ అతను ఆరోపించాడు. ఈ ఘటనపై ముజాహిద్ తండ్రి జూన్ 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఓం ప్రకాష్‌ని అరెస్ట్ చేశారు. దీనిపై బాధితుడు ముజాహిద్‌కి రూ. 2 కోట్ల పరిహారం ఇవ్వాలని బీకేయూ డిమాండ్ చేసింది.