Mother Takes to Hospital on Handcart: తల్లిని బతికించుకునేందుకు తనయుడి కష్టం.. చివరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి అనారోగ్యంతో వుంది. అంబులన్స్ కోసం ఫోన్ చేసిన ప్రయోజనం లేకపోయింది. చివరకు కడుపునొప్పితో తల్లడిల్లు తున్న ఆ తల్లిని తోపుడు బండిలో పడుకోబెట్టి తోసుకుంటూ నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేశాడు ఆకుమారుడు. విధి నిర్ణయం ఆ నిరుపేద కుటుంబానికి విషాదమే మిగిల్చింది. ఈఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాలాబాద్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాలాబాద్ పట్టణానికి చెందిన బీనాదేవి బుధవారం ఉదయం ఉన్నఫళంగా వచ్చిన కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయారు. అంబులెన్సు కోసం ఫోను చేసి, ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తోపుడుబండిపై తల్లిని పడుకోబెట్టి, నాలుగు కిలోమీటర్ల దూరంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు దినేశ్ పరుగు తీశాడు. అయితే.. విధి నిర్ణయం ఆ నిరుపేద కుటుంబానికి విషాదమే మిగిల్చింది. దీంతో.. బీనాదేవిని పరీక్షించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అమిత్ యాదవ్ ఆమె అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. అయితే.. సకాలంలో తల్లికి వైద్యసేవలు అందనందుకు చింతిస్తూ మళ్లీ అదే బండిపై ఆమె మృతదేహంతో దినేశ్ ఇంటిముఖం పట్టాడు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఈఘటనపై చనిపోయిన మహిళ కుటుంబసభ్యుల నుంచి తమకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని అంబులెన్సు సర్వీసుల ప్రోగ్రాం అధికారి తెలిపారు. వారు పరీక్షించేందుకు వెళ్లేసరికే ఆమె మరణించిందని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ అమిత్ యాదవ్ చెప్పారు. దీంతో..స్పందించిన షాజహాన్‌పుర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పీకే వర్మ, వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తామని అన్నారు. ఈనేపథ్యంలో.. కాల్ చేసిన 30 నిముషాల్లో అంబులెన్స్ చేరుకోవాలని, దూరం తక్కువైతే మరింత తొందరగా చేరుకోవాలన్నారు. అయితే.. తాజాగా ఇటువంటి ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పథక్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈఘటనపై సంబంధిత అధికారులను వివరణ కోరారు. ఫోన్ చేసిన స్పందించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.
CM KCR vs PM Modi : బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మొదలైన ప్రత్యక్ష యుద్ధం
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!