Site icon NTV Telugu

Mother Takes to Hospital on Handcart: తల్లిని బతికించుకునేందుకు తనయుడి కష్టం.. చివరకు..

Mother Takes To Hospital On Handcart

Mother Takes To Hospital On Handcart

తల్లి అనారోగ్యంతో వుంది. అంబులన్స్‌ కోసం ఫోన్‌ చేసిన ప్రయోజనం లేకపోయింది. చివరకు కడుపునొప్పితో తల్లడిల్లు తున్న ఆ తల్లిని తోపుడు బండిలో పడుకోబెట్టి తోసుకుంటూ నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేశాడు ఆకుమారుడు. విధి నిర్ణయం ఆ నిరుపేద కుటుంబానికి విషాదమే మిగిల్చింది. ఈఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాలాబాద్‌ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాలాబాద్‌ పట్టణానికి చెందిన బీనాదేవి బుధవారం ఉదయం ఉన్నఫళంగా వచ్చిన కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయారు. అంబులెన్సు కోసం ఫోను చేసి, ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తోపుడుబండిపై తల్లిని పడుకోబెట్టి, నాలుగు కిలోమీటర్ల దూరంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు దినేశ్‌ పరుగు తీశాడు. అయితే.. విధి నిర్ణయం ఆ నిరుపేద కుటుంబానికి విషాదమే మిగిల్చింది. దీంతో.. బీనాదేవిని పరీక్షించిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అమిత్‌ యాదవ్‌ ఆమె అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. అయితే.. సకాలంలో తల్లికి వైద్యసేవలు అందనందుకు చింతిస్తూ మళ్లీ అదే బండిపై ఆమె మృతదేహంతో దినేశ్‌ ఇంటిముఖం పట్టాడు.

ఈఘటనపై చనిపోయిన మహిళ కుటుంబసభ్యుల నుంచి తమకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని అంబులెన్సు సర్వీసుల ప్రోగ్రాం అధికారి తెలిపారు. వారు పరీక్షించేందుకు వెళ్లేసరికే ఆమె మరణించిందని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ సూపరింటెండెంట్ అమిత్ యాదవ్ చెప్పారు. దీంతో..స్పందించిన షాజహాన్​పుర్​ చీఫ్ మెడికల్​ ఆఫీసర్ పీకే వర్మ​, వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తామని అన్నారు. ఈనేపథ్యంలో.. కాల్​ చేసిన 30 నిముషాల్లో అంబులెన్స్​ చేరుకోవాలని, దూరం తక్కువైతే మరింత తొందరగా చేరుకోవాలన్నారు. అయితే.. తాజాగా ఇటువంటి ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పథక్​ దర్యాప్తునకు ఆదేశించారు. ఈఘటనపై సంబంధిత అధికారులను వివరణ కోరారు. ఫోన్‌ చేసిన స్పందించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.
CM KCR vs PM Modi : బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మొదలైన ప్రత్యక్ష యుద్ధం

Exit mobile version