Site icon NTV Telugu

UP: మీరట్ భయంతో భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త

Upmarriage

Upmarriage

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌‌లో జరిగిన హత్య ఘటన మగాళ్లలో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ప్రాణ భయంతో ముందుగానే భర్తలు అప్రమత్తం అవుతున్నారు. కోరుకున్న ప్రియుడితోనే భార్యలను ఇచ్చి పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే యూపీలోని ఫరూఖాబాద్‌లో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో వింతైన సంఘటన చోటుచేసుకుంది. తన భార్య స్థానిక యువకుడితో ప్రేమలో పడినట్లుగా భర్త గుర్తించాడు. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కూడా భర్తకు తెలియకుండా ప్రియుడితో తిరుగుతోంది. విషయాన్ని గమనించిన భర్త.. భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చాడు. అంతే పెద్దల సమక్షంలో భార్యను ప్రియుడికిచ్చి వివాహం జరిపించాడు. దగ్గరుండి మరీ పెళ్లి జరిపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత నెలలో మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరబ్‌ను భార్య, ఆమె ప్రియుడి అత్యంత దారుణంగా హతమార్చారు. బాడీని ముక్కలు.. ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో పూడ్చేశారు. సౌరభ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన తర్వాత చాలా మంది భార్యలు.. భర్తలను ఇదే తరహాలో హెచ్చరిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజా ఘటన కూడా అదే రీతిగా భయపడి జరిగించినట్లుగా తెలుస్తోంది.

 

Exit mobile version