NTV Telugu Site icon

Uttar Pradesh: యూపీలో 513 మదర్సాల గుర్తింపు రద్దు..

Madarasa

Madarasa

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో విఫలమైన 513 మదర్సాల గుర్తింపుని రద్దు చేయబోగోంది. యూపీలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లేని మదర్సాలపై సర్వేకి ఆదేశించి దాదాపు రెండేళ్ల తర్వాత, ఉత్తర్ ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ మంగళవారం జరిగిన సమావేశంలో 513 మదర్సాల అనుబంధాన్ని తొలగించాలని సిఫారసు చేసింది. వీటిలో చాలా మదర్సాలు బోర్డుకు సంబంధించిన పోర్టల్‌లో వివరాలను నమోదు చేయడంతో విఫలమయ్యాయి. మిగతావి వివిధ కారణాల వల్ల డిస్‌-అఫిలియేషన్‌ని కోరుకుంటున్నాయి.

యూపీ వ్యాప్తంగా దాదాపుగా 25,000 మదర్సాలు ఉన్నాయి. వీటిలో 16500 మదర్సాలు ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఉన్నాయి. మదర్సా బోర్డు ఛైర్మన్ ఇఫ్తికార్ అహ్మద్ జావేద్ ఈ అంశంపై మాట్లాడారు. ‘‘ మంగళవారం జరిగిన సమావేశంలో మొదటి ప్రతిపాదన 2018 నుంచి 2024 వరకు మార్క్‌‌షీట్‌లను అప్‌లోడ్ చేయడం. పాత మార్క్ షీట్లను కూడా పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కొత్త మదర్సాల అఫిలియేషన్ ఇవ్వడంపై చర్చ జరిగింది. అఫిలియేషన్ కోసం కొత్తగా దరఖాస్తులు పోర్టల్ ద్వారా ఆమోదించబడుతాయి’’ అని అన్నారు.

Read Also: JK Encounter: ఉదంపూర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

వివిధ జిల్లా లనుంచి స్వీకరించిన సుమారు 513 మదర్సాల సరెండర్ మరియు గుర్తింపు రద్దు ప్రతిపాదనల్ని బోర్డు ఆమోదించిన తర్వాత 2016 నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు రిజిస్ట్రార్‌కి అధికారం ఇవ్వబడింది. వివిధ జిల్లా నుంచి స్వయంగా బోర్డు నుంచి డిస్-అఫిలియేషన్ కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. వీటికి కారణాలు తెలుసుకోవడంతో పాటు, నిబంధనల ప్రకారం వాటి రద్దు జరుగుతుంది.

యుపి మదర్సా బోర్డు ప్రతిపాదనపై ముస్లిం మత గురువు మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలీ స్పందిస్తూ, “డి-అఫిలియేషన్ అంటే మదర్సాలకు రహదారి ముగింపు అని కాదు. అనేక ఇతర మదర్సాల మాదిరిగా సొసైటీ లేదా ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థను కొనసాగించే అవకాశం వారికి ఇప్పటికీ ఉంటుంది. అలాగే, వారు ఇతర బోర్డులు లేదా నద్వతుల్ ఉలమా వంటి సంస్థల నుండి అఫిలియేషన్ తీసుకోవచ్చు.’’ అని చెప్పారు.

Show comments