Mamata Banerjee: కుంభమేళా తొక్కిసలాట మృతుల సంఖ్యను యోగీ సర్కార్ చెప్పడం లేదు..
- కుంభమేళా తొక్కిసలాటపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణ..
- యూపీ సర్కార్ మృతుల సంఖ్యని సరిగా వెల్లడించడం లేదని ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మీడియాతో బుధవారం మాట్లాడారు. ‘‘మహా కుంభమేళాలో చాలా మంది మరణించారు. కానీ సరైన సంఖ్యని చెప్పడం లేదు. వారు కుంభమేళాకి హైప్ పెంచారు. అందుకు తగ్గట్లుగా సౌకర్యాలు చేయలేదు. పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించారు. కానీ వేదికల వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదు’’ అని ఆరోపించారు.
గత నెలలో అమృత స్నానం సమయంలో భారీ ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంట్లో 30 మంది భక్తులు మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ దీనిపై విచారణకు జ్యుడిషియల్ కమిటీని నియమించింది. మరోవైపు రాష్ట్ర పోలీసులు కుట్ర కోణం ఏదైనా ఉందా..? అని విచారణ జరుపుతున్నారు.
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ఇదిలా ఉంటే, కేంద్రం బెంగాల్ కి బకాయులను విడుదల చేయడంలో విఫలమైందని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని ఇవ్వడం లేదని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కూడా ముఖ్యమంత్రి ప్రతిస్పందిస్తూ.. ఇది పక్షపాతం, వాస్తవం కాదని ఆమె అన్నారు. బెంగాల్‌కి వ్యతిరేకంగా నిర్మలా సీతారామన్ ప్రకటన ఉందని అన్నారు. మంగళవారం సీతారామన్ అధికార పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, తృణమూల్ కాంగ్రెస్ దోపిడీకి మారుపేరుగా మారిందని, ఆ పార్టీ అవినీతిని పెంచిందని, సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
2026లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టర్మ్‌లో చివరిదైన బడ్జెట్‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య బుధవారం ప్రవేశపెట్టారు. రూ. 3.89 లక్షల కోట్ల బడ్జెట్‌ని సమర్పించారు. రాష్ట్ర ఉద్యోగులకు 4 శాతం డీఏని పెంచారు. వ్యవసాయ, గ్రామీణ రంగాలకు అధికంగా నిధులు కేటాయించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు