Site icon NTV Telugu

Assembly Elections: ఇవాళ యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో పోలింగ్

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ యూపీ, గోవా లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అటు ఉత్తరాఖండ్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఉత్తరాఖండ్‌, గోవా రాష్ట్రాలలో ఒకే విడతలో ఎన్నికలు పూర్తి అవుతాయి. యూపీలో నేడు రెండవ విడతలో 55 స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 586 మంది అభ్యర్ధులు రంగంలో ఉండగా, అందులో 69 మంది మహిళా అభ్యర్ధులు వున్నారు. ఉత్తరాఖండ్ లోని 70 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 632 మంది అభ్యర్దులు పోటీ పడుతున్నారు.

https://ntvtelugu.com/ipl-mega-auction-is-completed-here-complete-details/

ఉత్తరాఖండ్‌లోవరుసగా రెండవ సారి అధికారం, అవకాశం ఇవ్వాలని కోరుతోంది బీజేపీ. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 301 అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. గోవాలో మరోసారి అధికారాన్ని ఆశిస్తోంది బీజేపీ.

Exit mobile version