ఓవైపు ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. తాజాగా ట్విట్టర్ ఇండియాకు లీగల్ నోటీసులు పంపించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.. ఇటీవల యూపీలోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి ఘటనలో మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.. సూఫీ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి తనపై దాడి చేసిన ముఠా.. వందేమాతరం, జై శ్రీరాం.. నినాదాలు చేశారని ఆరోపించగా.. ఈ ఘటనలో మతపరమైంది ఏమీ లేదని యూపీ పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆ దాడి ఆరోపణలకు సంబంధించిన వీడియోను కొందరు ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. థర్డ్ పార్టీ కంటెంట్‌ను కలిగి ఉందని.. ఆ వీడియోను తొలగించలేదంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.. ఈ విషయంలోనే.. ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌కు లీగల్ నోటీసు పంపారు యూపీ పోలీసులు.. వారం రోజుల్లోగా.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహ్వేశ్వరిని ఆదేశించారు పోలీసులు. కాగా, ఈ కేసులో ఇప్పటికే పలువురు జర్నలస్టులు, కొందరు నాయకులపై సైతం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
ట్విట్టర్‌కు యూపీ పోలీసుల లీగల్ నోటీసు
legal notice