UP Elections 2027: యూపీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్న అఖిలేశ్? 24 సీట్లే ఆఫర్ చేసే ఛాన్స్
- యూపీలో తేలిన ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు ..
- 181 స్థానాలు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్..
- 24 సీట్లు ఇచ్చేందుకు అఖిలేష్ ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు ఆసక్తికరంగా మారాయి. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉంటే 181 స్థానాలు కావాలని కాంగ్రెస్ ఎస్పీని కోరుతోంది. అయితే, కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ కేవలం 24 స్థానాలను మాత్రమే అఖిలేష్ యాదవ్ పార్టీ ఆఫర్ చేస్తోందని సమాచారం. ఎస్పీ తొలుత కాంగ్రెస్‌కు సుమారు 24 స్థానాలు కేటాయించే ప్రతిపాదన చేయవచ్చని తెలుస్తోంది. ఎక్కువ సీట్లు దక్కించుకోవాలంటే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బేరసారాలు జరపాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం ఎస్పీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను పార్టీ తన వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన పనితీరు ఆధారంగా సీట్లు కేటాయిస్తామని ఎస్పీ చెబుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ అభ్యర్థులు 20 వేలకు పైగా ఓట్లు సాధించిన నియోజకవర్గాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- MP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. 'ఇద్దరు పిల్లల నిబంధన'ను ఎత్తివేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం..
- Delhi Police: రీల్స్ చేసే వారు జర్నలిస్టులు కాదు.. సుప్రీంకు ఢిల్లీ పోలీసుల నివేదిక!
- Cyclone Akvan: నెమ్మదిగా కదులుతున్న "అక్వాన్ తుఫాన్".. మరింత డేంజర్ అంటున్న సైంటిస్టులు.!
- Jain Monkhood: రూ.15 కోట్ల వ్యాపారాన్ని వదిలి సన్యాసం.. ఒకే కుటుంబంలో నలుగురి నిర్ణయం!
181 స్థానాలు కోరుతున్న కాంగ్రెస్..
403 స్థానాల్లో కాంగ్రెస్ 181 స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. కూటమిలో సమాన భాగస్వామిగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. నిజానికి 403 సీట్లలో 200 చోట్ల పోటీ చేయాలని కాంగ్రెస్ తొలుత భావించింది. సీట్ల పంపకాల చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో 181 స్థానాలకు సంబంధించిన జాబితా లీక్ అయింది. ఇందులో ఎస్పీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్‌కు సంప్రదాయకంగా బలం ఉన్న అమేథీ, రాయ్‌బరేలీ, సహరాన్పూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ సీట్లను కోరుతోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో ఎస్పీ ఎమ్మెల్యేలు గెలిచారు.
2022లో కాంగ్రెస్ పనితీరు ఎలా ఉంది.?
గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఒంటరిగా పోటీ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎస్పీతో పొత్తులో 114 స్థానాలకు పోటీ చేస్తే కేవలం ఏడు స్థానాల్లో విజయం సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ 311 స్థానాల్లో 47 సీట్లను గెలుచుకుంది. 1989 వరకు యూపీని పాలించిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది.
తాజావార్తలు
-
UP Elections 2027: యూపీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్న అఖిలేశ్? 24 సీట్లే ఆఫర్ చేసే ఛాన్స్
-
Sree Leela: నాపై నాకే అనుమానాలు వచ్చాయి.. శ్రీలీల షాకింగ్ కామెంట్స్!
-
MP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను ఎత్తివేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం..
-
Stock Market Crash: దలాల్ స్ట్రీట్‌లో రక్తపాతం.. ఒక్క దెబ్బతో రూ.6 లక్షల కోట్లు ఆవిరి.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ!
-
Suriya : విలన్ నటనకు ఫిదా.. రూ. 9 లక్షల వాచ్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..