Site icon NTV Telugu

UP: సీఎం యోగి సరికొత్త నిర్ణయం.. 7 నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏం చేశారంటే..!

Cmyogi

Cmyogi

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. చారిత్రాత్మక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఏడు నగరాల్లో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ కోసం మహిళా సిబ్బందినే నియమించాలని పోలీస్ శాఖకు ఆదేశించారు. లింగ సమతుల్యత కోసం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: రేపు 2 దేశాల పర్యటనకు వెళ్లనున్న మోడీ

నెల రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం తర్వాత ప్రస్తుత సివిల్ పోలీస్ ఫోర్స్ నుంచి తీసుకోబడిన సుమారు 600 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను పరిగణనలోకి తీసుకోనున్నారు. అక్టోబర్‌ నుంచి లక్నో, కాన్పూర్, ఘజియాబాద్, ప్రయాగ్‌రాజ్, వారణాసి, ఆగ్రా, గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసు కమిషనరేట్లలో మహిళా సిబ్బంది నియమితులు కానున్నారు.

ఇది కూడా చదవండి: Off The record: మిత్రపక్షం టీడీపీకే షాకిచ్చిన బీజేపీ నేత..!

లింగ సమానత్వంలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి యోగి ఆదేశాల మేరకు మహిళలను నియమిస్తున్నట్లు అదనపు జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సత్యనారాయణ్ తెలిపారు. మొదటిసారిగా ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోందని.. అభ్యర్థులు క్లీన్ సర్వీస్ రికార్డ్ కలిగి ఉండాలని.. ట్రాఫిక్ విధులను చేపట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేయాలని తెలిపారు. మొదటి దశలో ఏడు కమిషనరేట్లలో ప్రతిదానిలో 13 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించనున్నట్లు వెల్లడించారు.

మహిళా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ట్రాఫిక్ విభాగాన్ని విస్తరించడంలో భాగంగా సివిల్ పోలీసుల నుంచి 5,000 మంది పురుష సిబ్బందిని చేర్చుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. కొత్తగా చేరిన పురుషులు, మహిళలు అందరూ జోనల్ మరియు కమిషనరేట్ కేంద్రాల్లో శిక్షణ పొందనున్నారు.

Exit mobile version