UP CM Yogi Adityanath: కార్తీక పౌర్ణమీ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ భక్తులకు సందేశం ఇచ్చారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలోని సరయూ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఈ పవిత్ర స్నానాలు కొనసాగనున్నాయి. దీంతో కార్తీక పౌర్ణమి విశిష్ఠత, ఈ పవిత్ర స్నానాల ప్రాముఖ్యతను వివరిస్తూ యోగి ఆదిత్య నాథ్ కార్యాలయం నుంచి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ట్వీట్(ఎక్స్) చేసింది.
Also Read: Hyderabad Metro: అలర్ట్.. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో మూసివేత..
‘భారతీయ సంస్కృతి సంప్రదాయంలో కార్తీక పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున, విష్ణువు మత్స్య అవతారం ఎత్తాడు. ప్రళయం ముగిసే వరకు ఏడుగురు ఋషులను, వేదాలను రక్షించాడు. దానివల్లే విశ్వం పునర్నిర్మాణం సాధ్యమైంది. దీనితో పాటుగా శంకరుడు ఈ రోజున త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఈ పండుగ మానవులకు ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది’ అని తెలిపారు. అలాగే యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా భక్తులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ కార్తీక పౌర్ణమి పవిత్ర స్నానాల కోసం అయెధ్య సరయూ నది వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయోధ్య ప్రాంతాన్ని 15 సెక్టార్‌లుగా విభజించి మూడు భద్రతా మండలాలుగా విభజించారు. భక్తుల రెస్క్యూ కోసం స్నాన ఘాట్ల వద్ద పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్), సహాయక సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేసిన సీనియర్ అధికారి తెలిపారు.
Also Read: KTR: ఏడ్వాలంటే కాంగ్రెస్‌కు.. నవ్వాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయండి