NTV Telugu Site icon

Maha Kumbh Mela 2025: స్నానం ఆచరించిన యూపీ కేబినెట్.. కొద్దిసేపు జలకలాట

Cmup

Cmup

మహా కుంభమేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, కేబినెట్ మంత్రులు త్రివేణి సంగమంలో బుధవారం పవిత్ర స్నానాలు ఆచరించారు. అంతకముందు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి స్నానం చేశారు. అంతేకాకుండా కొద్దిసేపు ఒకరిపై ఒకరు నీళ్లు జల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Viral Video: దెబ్బకు వైరల్‌ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అనేకమైన ముఖ్యమైన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించారు. గంగానదిపై ఆరు లైన్ల వంతెన నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రయాగ్‌రాజ్‌-చిత్రకూట్‌ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. ప్రయాగ్‌రాజ్ మరియు పరిసర ప్రాంతాల స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రయాగ్‌రాజ్‌ని మిర్జాపూర్, భదోహి, కాశీ, చందౌలీకి కలుపుతూ.. ఘాజీపూర్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానం చేస్తూ గంగా ఎక్స్‌ప్రెస్‌వే పొడిగింపును చేపట్టబడుతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం అనంతరం చెప్పారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, 54 మంది మంత్రులతో కూడిన రాష్ట్ర మంత్రివర్గం పవిత్ర స్నానాలు చేశారు. ఇలా చేయడం ఇది రెండోసారి కావడం విశేషం.

ఇది కూడా చదవండి: Viral Video: దెబ్బకు వైరల్‌ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)