Site icon NTV Telugu

Uttar Pradesh: పేపర్ లీకులకు చేశారో అంతే సంగతి.. జీవిత ఖైదు, రూ. 1 కోటి జరిమానా..

Cm Yogi

Cm Yogi

Paper leak cases: నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీక్ కేసులు దేశవ్యాప్తంగా సంచలన రేపాయి. మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రతిపక్షాలు, పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి. ఈ ఆందోళనల నడుమ పరీక్ష బాధ్యతలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్మాణం, పనితీరు, పాదర్శకతను మెరుగుపరిచేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది.

Read Also: Triple Talaq: బీజేపీకి సపోర్ట్ చేసినందుకు భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’’

ఇదిలా ఉంటే, పేపర్ లీకులను అరికట్టేందుకు సీఎం యోగి నేతృత్వంలో ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు లీకులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కఠిన చట్టాన్ని తీసుకురాబోతోంది. ఇలాంటి కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులకు జీవిత ఖైదుతో పాటు రూ. 1కోటి వరకు జరిమానా విధించాలనే కఠిన చట్టాన్ని తీసుకువస్తోంది. ముఖ్యమంత్రి యోగి అధ్యక్షతన జరిగిన ఉత్తరప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) ఆర్డినెన్స్ 2024కి యూపీ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం యూపీ అసెంబ్లీ సమావేశాలు లేనందుకున ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఆర్డినెన్స్‌లోని నిబంధనలు డిగ్రీ, డిప్లొమా మరియు ఇతర కోర్సులకు ప్రవేశ పరీక్షలతో పాటు పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు, రెగ్యులరైజేషన్ లేదా ప్రమోషన్ పరీక్షలకు వర్తిస్తాయని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. నకిలీ పరీక్షా పత్రాల పంపిణీ మరియు నకిలీ ఉద్యోగ వెబ్‌సైట్‌లను తయారు చేయడం కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించబడింది. ఇలాంటి కేసుల్లో దోషులుగా తేలిన వారికి రెండేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. పరీక్షలు నిర్వహంచే కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ల నుంచి పరీక్ష రద్దు వల్ల అయ్యే ఖర్చును తీసుకునేందుకు, వాటిని బ్లాక్ లిస్టు చేయడానికి కూడా ఆర్డినెన్స్ నిబంధనలు పేర్కొంటున్నాయి.

Exit mobile version