UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు
- పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు
- డజన్ల కొద్దీ సైనికులు తనిఖీలు
- బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు
- ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు సైనిక హెలికాప్టర్లు.. డజన్ల కొద్దీ సైనికులు. ఒక్కసారిగా గ్రామంపై మోహరించారు. ఏం జరుగుతుందో తెలియక చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు హడలెత్తిపోయారు. చాలా మంది నిశ్చేష్టులైపోయారు. ఇందుకు ఉత్తరప్రదేశ్‌లోని నారాయణి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు వేదికయ్యాయి. అసలేం జరిగింది? ఒకేసారి గ్రామంపైకి మూడు హెలికాప్టర్లు, సైన్యం ఎందుకు మోహరించాయి. తెలియాలంటే ఈ వార్త చదవండి.

Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
మంగళవారం బండా పొలాల్లోకి హఠాత్తుగా మూడు సైనిక హెలికాప్టర్లు, డజన్ల కొద్దీ సైనికులు దిగి గ్రామాన్ని చుట్టుముట్టారు. చాలా తక్కువ ఎత్తుల హెలికాప్టర్లు ఎగరడంతో పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయి. దీంతో గ్రామస్తులు భయంతో బయటకు వచ్చారు. ఇంకొందరు మిద్దెలపైకి ఎక్కి భయం.. భయంతో వీక్షించారు. బండాలోని నరాయిని ప్రాంతాన్ని సైనికులు తీవ్రంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో గ్రామస్తుల భయాందోళనకు గురయ్యారు. సెర్చ్ ఆపరేషన్ పూర్తయ్యాక.. మాక్ డ్రిల్ అని సైనికులు చెప్పడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మొబైల్స్‌లో బంధించారు.
అయితే ఎప్పుడూ ఇలాంటి ఘటన ఎదురుకాకపోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మాక్ డ్రిల్ అని తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు. చాలామంది ఈ సంఘటనను తమ మొబైల్‌లో బంధించారు. సుమారు కొన్ని గంటల పాటు ఈ విన్యాసం సాగింది.
భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. నారాయణి కొత్వాలి ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జ్ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. ఈ మొత్తం ఆపరేషన్‌ను సైన్యం ఒక మాక్ డ్రిల్‌లో భాగంగా నిర్వహించిందని వివరించారు. భద్రతా వ్యవస్థను, అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన స్పందించే సామర్థ్యాన్ని పరీక్షించడమే దీని ఉద్దేశ్యమని తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదని.. ఇది ఒక సాధారణ విన్యాసంలో భాగమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!