NTV Telugu Site icon

Allahabad HC: ‘‘యూపీ మతమార్పిడి నిరోధక చట్టం’’ భారత లౌకిక స్పూర్తికి నిదర్శనం..

Anti Conversion Law

Anti Conversion Law

Allahabad HC: ‘‘ఉత్తర్ ప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టాన్ని’’ అలహాబాద్ హైకోర్టు సమర్ధించింది. భారత లౌకిక స్పూర్తికి ఇది నిదర్శమని చెప్పింది. ఈ చట్టం సామాజిక సామరస్యాన్ని నిర్ధారించడానికి, దేశ లౌకిక స్వరూపాన్ని నిలబెట్టడానికి అవసరమని కోర్టు పేర్కొంది. ఈ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం-2021 యొక్క ప్రాథమిక లక్ష్యం మతపరమైన స్వేచ్ఛని పౌరులందరికి నిర్ధారించడమే అని కోర్టు నొక్కి చెప్పింది. ఈ చట్టం సామాజిక సామరస్యాన్ని నిర్ధారించడానికి మరియు దేశం యొక్క లౌకిక స్వరూపాన్ని నిలబెట్టడానికి అవసరమని కోర్టు పేర్కొంది.

ఈ కేసుని విచారించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్, రాజ్యాంగం ప్రతీ వ్యక్తికి వారి మతాన్ని ప్రకటించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేయడానికి ప్రాథమిక హక్కుని కల్పిస్తున్నప్పటికీ, ఈ హక్కు మతమార్పిడికి వర్తించదని తీర్పులో పేర్కొన్నారు. వ్యక్తిగత హక్కులు మరియు సామాజిక ప్రయోజనాల మధ్య సమతుల్యతను ఎత్తిచూపుతూ, “మతమార్పిడి చేసే వ్యక్తికి మరియు మారాలని కోరుకునే వ్యక్తికి మత స్వేచ్ఛ హక్కు సమానంగా ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

ఈ కేసులో అజీమ్ అనే నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు, ఇందులో 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) మరియు 506 ( నేరపూరిత బెదిరింపు), UP చట్టవిరుద్ధంగా మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. గత ఏడాది జూన్ 27 నుంచి అజీమ్ జైలులో ఉన్నాడు.

Read Also: Iran-Israel Tensions: ఇజ్రాయిల్‌పై ఈ వారమే ఇరాన్ దాడి చేయొచ్చు.. యూఎస్ బిగ్ వార్నింగ్..

అజీమ్‌పై ఒక మహిళ తీవ్రమైన ఆరోపణలు చేసింది. అజీమ్ తన అసభ్యరమైూన వీడియోలు తీశాడని, వాటి ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక దోపిడీ చేశాడని మహిళ పేర్కొంది. తనను ఇస్లాంలోకి మారాలని, మాంసాహార ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ముస్లిం సంప్రదాయ దుస్తుల్ని ధరించాలని ఒత్తిడి తెస్తున్నాడంటూ ఆరోపించింది. తనతో కలిసి జీవించాలని ఒత్తిడి తీసుకువస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే, అజీమ్ తరుపు న్యాయవాది వాదిస్తూ.. ఆమె స్వచ్ఛందంగా ఇంటిని వదిలివచ్చిందని, అజీమ్‌తో సంబంధం పెట్టుకుందని చెప్పాడు. ఇద్దరి వివాహం ఘనంగా నిర్వహించుకున్నట్లు ఆ మహిళ అంగీకరించినట్లు అతను వాదించాడు.

అయితే, ప్రభుత్వ న్యాయవాది అజీమ్ బెయిల్‌ని వ్యతిరేకిస్తూ, అతను ఆమెను ఇస్లాంలోకి బలవంతంగా మార్చాలని చూశాడని కోర్టుకు చెప్పారు. ఆమె అధికారికంగా మతంలోకి మారకముందే ఆమె నిఖా వేడుక నిర్వహించబడిందని, ఇది మతమార్పిడి నిరోధక చట్టాన్ని ఉల్లంగిస్తుందని, బక్రీద్ సమయంలో వారి ఆచారాల్లో పాల్గొనాలని ఆమె అత్తగారు ఒత్తిడి చేశారని, అయితే అందుకు మహిళ నిరాకరించినట్లు చెప్పారు.

మతమార్పిడి నిరోధక చట్టం యొక్క ప్రాముఖ్యతను న్యాయస్థానం పునరుద్ఘాటిస్తూ, “భారతదేశం యొక్క సామాజిక సామరస్యం మరియు స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, ప్రజలందరికీ మత స్వేచ్ఛకు హామీ ఇవ్వడమే చట్టం అమలుకు ప్రాథమిక లక్ష్యం. ఈ చట్టం యొక్క లక్ష్యం భారతదేశంలో లౌకికవాద స్ఫూర్తిని నిలబెట్టడమే.” రాష్ట్రానికి మతం లేదని, చట్టం ముందు అన్ని మతాలు సమానమేనని, ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వబడదని కూడా కోర్టు పునరుద్ఘాటించింది. యూపీ బలవంతవపు మతమార్పిడి చట్టం-2024 ప్రకారం, బలవంతంగా మతం మారిస్తే తీవ్రతను బట్టి గరిష్టంగా 10 ఏళ్ల యావజ్జీవ కారాగార శిక్షని 20 ఏళ్లకు పెంచారు.

Show comments