NTV Telugu Site icon

బీహార్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌…

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండటంతో ఒక్కో రాష్ట్రంలో ఆంక్ష‌లు, స‌డ‌లింపులు ఇస్తూ వ‌స్తున్నారు.  ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌, ఢిల్లీలో లాక్‌డౌన్ ఎత్తివేసి అన్‌లాక్ ప్ర‌క్రియ‌ను అమ‌లు చేస్తున్నారు.  అన్‌లాక్ ప్ర‌క్రియ అమ‌లు చేస్తున్నా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు.  నిన్న‌టి రోజున ఢిల్లీలో రోడ్లు బోసిపోయి ద‌ర్శ‌నం ఇచ్చాయి.  బీహార్ రాష్ట్రంలో కూడా లాక్‌డౌన్ ను ఎత్తివేస్తు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  అన్‌లాక్ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తున్న‌ట్టు బీహార్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  రాత్రి 7 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  ప్ర‌భుత్వ, ప్రైవేట్ సంస్థ‌లు 50 శాతం మందితో ప‌నిచేసేందుకు బీహార్ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.