NTV Telugu Site icon

అన్‌లాక్‌ మొదలైంది..!

Unlock

Unlock

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను సడలించి.. నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, మేఘాలయల్లో లాక్‌డౌన్‌ విధిస్తూనే…. భారీగా సడలింపులు ఇచ్చారు. తాజాగా బిహార్‌లో లాక్‌డౌన్‌ తొలిగించారు. అయితే అక్కడ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ ఎత్తేసి.. పగటిపూట కర్ఫ్యూ కొనసాగించినప్పటికీ… తాజాగా ఆ కర్ఫ్యూను కూడా తొలిగించి నైట్‌ కర్ఫ్యూను మాత్రమే అమలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈనెల 15 వరకు కర్ఫ్యూ పొడిగించిన ప్రభుత్వం… మరికొన్ని సడలింపులు ఇచ్చింది. మరోవైపు తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ పొడిగించింది సర్కార్.. అయితే, సడలింపుల సమయం పెంచింది.. లాక్‌డౌన్‌ సమయం కుదించింది.. తాజా నిర్ణయంతో 12 గంటలు సడలింపులు, మరో 12 గంటలు లాక్‌డౌన్‌ కొనసాగనుంది.. ఇలా క్రమంగా అన్ని రాష్ట్రాలు అన్‌లౌక్‌ వైపు అడుగులు వేస్తున్నాయి.