Site icon NTV Telugu

Mass Festival: ఇదేక్కడి దీపావళి పండగరా బాబు… మరీ ఇలా కూడా చేసుకుంటారా

Untitled Design (2)

Untitled Design (2)

దీపావళి పండుగను.. ఇంట్లో దీపాలతో … ఇంటిని అందంగా అలంకరించి.. సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు, కొత్త బట్టలు, టపాసులు. సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందంతో కూడిన మేలు కలయికగా ఈ దీపావళి వేడుకలను జరుపుకుంటారు. లక్ష్మీపూజ, దీపాల వెలుగులు, పటాసుల మోతలు వినిపిస్తుంటాయి. కానీ కర్ణాటకలో మాత్రం దీపావళి పండుగను వెరైటీగా చేసుకుంటారు. మగవాళ్లు ఆవుపేడను విసురకుంటూ.. ఆడవాళ్లు ఆవు పేడను ఒంటికి రాసుకుంటూ పండగ జరుపుకుంటారు. కర్ణాటక ,తమిళనాడు సరిహద్దులోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకుని జరుపుకునే గోరెహబ్బ పండుగ ఒక ప్రత్యేకమైన ఆవు పేడ విసిరే ఆచారం.. ఆవు పేడ శుద్ధి చేసే ,ఔషధ గుణాలను కలిగి ఉందనే నమ్మకం ఆధారంగా ఈ కార్యక్రమం శతాబ్దాల నాటి సంప్రదాయం.

Read Also:Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా..

ఈ పండుగ దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక , తమిళనాడు మధ్య సరిహద్దులో ఉన్న గుమతాపుర అనే గ్రామంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం దీపావళి బలి పాడ్యమి తర్వాత రోజున గోరెహబ్బ పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పండుగ మధ్యాహ్నం, గ్రామస్తులు పశువుల యజమానుల ఇళ్ల నుండి “మందుగుండు సామగ్రి” సేకరిస్తారు. పేడను ట్రాక్టర్-ట్రాలీల ద్వారా స్థానిక ఆలయానికి తరలిస్తారు. అక్కడ ఒక పూజారి ఆశీర్వాద కర్మ చేస్తారు.ఆశీర్వాదం తర్వాత, ఆవు పేడను బహిరంగ ప్రదేశంలో వేస్తారు. ఆ తరువాత పురుషులు లోపలికి వెళ్లి ఒకరిపై ఒకరు విసురుకుంటారు. స్థానికులకు, ఈ కార్యక్రమం ఒక ఆనందకరమైన, ప్రతీకాత్మకమైన శుద్ధీకరణ ఆచారం, ఇది మంచి ఆరోగ్యం, శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.

Read Also:IVF: ముసలోడే కానీ.. 93ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న తాత

ఇందులో పాల్గొనేవారు ఆవుపేడను విసురుకోవడంతో.. కొన్ని వ్యాధులను నయం చేయగలదని కూడా నమ్ముతారు. ఈ పండుగ స్థానిక దేవత బీరేశ్వర స్వామి ఆవు పేడ నుండి జన్మించినందుకు జరుపుకుంటారు. మరొక పురాణం ప్రకారం ఆవు పేడ కుప్పలో ఒక లింగం దొరకడంతో ఈ పండగను నిర్వహించుకుంటున్నారు.

Exit mobile version