ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ హింస కేసులో ప్రధాన నిందితుడు, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కోర్టులో లొంగిపోయాడు. లఖింపూర్‌లో వ్యవసాయ చట్టాలపై శాంతియుతంగా పోరాడుతున్న రైతులపైకి కారుతో వేగంగా దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా ఆ తర్వాత జరిగిన అల్లర్లలో మరో నలుగురు సహా మొత్తం 8 మంది మృతికి కారకుడయ్యాడంటూ ఆశిష్ మిశ్రాపై తీవ్ర అభియోగాలు వచ్చాయి. దీంతో ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ మేరకు ఆశిష్ మిశ్రాపై నమోదైన కేసులో అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతవారం రద్దు చేసింది. ఆశిష్ మిశ్రా బయట ఉంటే ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని బాధితులు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో బాధితులు తమ వాదనలను వినిపించేందుకు అలహాబాద్ హైకోర్టులో అవకాశం దొరకలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో బాధితుల తరుపున అంశాలను అలహాబాద్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆశిష్ మిశ్రా లఖింపూర్‌లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆదివారం లొంగిపోయాడు. లఖింపూర్ కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం సిట్ వేయగా ఓ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోనే దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Chennai: ప్లాట్‌ఫారంపైకి దూసుకొచ్చిన రైలు.. తప్పిన ప్రాణనష్టం