Site icon NTV Telugu

కేసీఆర్‌ పిటిషన్‌ వెనక్కి తీసుకొని నెల రోజులే : గజేంద్ర సింగ్‌ షెకావత్‌

సీఎం కేసీఆర్‌ లేవనెత్తిన అంశాలపై కేంద్ర శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పందించారు. కృష్ణ జలాలపై కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటులో జాప్యానికి కారణం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు. కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారన్నారు. ఈ అంశంపై కేసీఆర్‌ సర్కార్‌ వేసిన పిటిషన్‌ సుప్రీం కోర్టులో ఉన్నందున మేము నిర్ణయం తీసుకోలేమని చెప్పామన్నారు.

దీంతో రెండు రోజుల్లో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని తెలిపి.. 8 నెలలకు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారన్నారు. పిటిషన్‌ వెనక్కి తీసుకొని కూడా నెల రోజులే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా సీఎంల అంగీకారం తర్వాతే బోర్టుల పరిధి నిర్ణయించామని, నోటిఫికేషన్‌పై ఎలాంటి వివాదాలు లేవని ఆయన తెలిపారు.

Exit mobile version