Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: అంతర్జాతీయ మీడియా కథనాలపై రామ్మోహన్ నాయుడు ఏం తేల్చారంటే..!

Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలన్నీ తప్పుడు కథనాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మెహన్ నాయుడు కొట్టిపారేశారు. అంతర్జాతీయ మీడియా సొంత కథనాన్ని ప్రసారం చేస్తున్నాయని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు. విమాన ప్రమాదంపై రాజ్యసభలో రామ్మెహన్ నాయుడు మాట్లాడారు. ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. అయితే ఈ ప్రమాదంపై పాశ్చాత్య మీడియా సొంత కథనాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. ప్రాథమిక రిపోర్టును అడ్డంపెట్టుకుని తొందరపాటు నిర్ణయాలకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. విమానం బ్లాక్ బాక్స్‌ల నుంచి డేటాను డీకోట్ చేయడంలో ఏఏఐబీ విజయం సాధించిందని ప్రశంసించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం విచారకరమని.. ప్రమాదంపై ప్రజలు గానీ.. మీడియా గానీ తొందరపాటు నిర్ణయాలకు రావొద్దని రాజ్యసభ వేదికగా కేంద్రమంత్రి కోరారు.

ఇది కూడా చదవండి: Sonam Raghuvanshi: జైల్లో నెలరోజులు పూర్తి చేసుకున్న సోనమ్.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు!

ఇటీవల ప్రాథమిక రిపోర్టు వచ్చింది. అందులో ఒక పైలట్ ఫ్యూయిల్ స్విచ్‌లు ఎందుకు ఆపావని అడిగితే.. నేను ఆపలేదంటూ మరొక పైలట్ బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలను బట్టి పైలట్ ఆత్మహత్య చేసుకున్నాడని.. అందుకే ఫ్యూయిల్ స్విచ్‌లు ఆపేశాడంటూ మీడియాలో కథనాలు ఊదరగొట్టాయి. అయితే ఈ వార్తలపై పైలట్ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. తుది నివేదిక రాకుండా ఎలా కథనాలు ప్రచారం చేస్తారంటూ ధ్వజమెత్తారు. ఇక మీడియా కథనాలను అమెరికా దర్యాప్తు సంస్థ కూడా తీవ్రంగా తప్పుపట్టింది. దీంతో పాశ్చాత్య మీడియాకు పైలట్ సంఘాలు నోటీసులు పంపాయి. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

ఇది కూడా చదవండి: Dhaka Plane Crash: వణికించిన మరో ప్రమాదం. స్కూల్ భవనంపై కూలిన ఎయిర్ క్రాఫ్ట్..

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం బయల్దేరింది. కొన్ని సెకన్లలోనే హాస్టల్‌పై కూలిపోయింది. విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక హాస్టల్‌లో ఉన్న మెడికోలు చనిపోయారు. మొత్తంగా 279 మంది చనిపోయారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం ఇచ్చింది.

Exit mobile version