NTV Telugu Site icon

Chandrayaan 3: ల్యాండర్, రోవర్ నుంచి నో సిగ్నల్.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఏమన్నారంటే..?

Chandrayaan 3

Chandrayaan 3

Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగంలో దాదాపుగా రెండు వారాలుగా చంద్రుడి ఉపరితలంపై స్లీప్ మోడ్ లో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ని నిద్రలేపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయత్నిస్తోంది. చంద్రుడిపై రాత్రి ప్రారంభమైన తర్వాత సెప్టెంబర్ 2న ల్యాండర్, రోవర్ని ఇస్రో స్లీప్ మోడ్ లోకి పంపింది. చంద్రుడిపై ఒక పగలు, ఒక రాత్రి 14 భూమి రోజులతో సమానం.

అయితే ఇస్రో ఈ రోజు ల్యాండర్, రోవర్ తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నించింది. ఇంత వరకు గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు ఎస్టాబ్లిష్ కాలేదని ఇస్రో తెలిపింది. సంబంధాలు ఏర్పరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తామని ప్రకటించింది.

Read Also: Rahul Gandhi: డానిష్ అలీని కలిసిన రాహుల్ గాంధీ.. కౌగిలించుకునే ఫొటో పోస్ట్

చంద్రయాన్-3పై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. చంద్రుడిపై సూర్యోదయం అనంతరం నుంచి గత కొన్ని గంటలుగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో సంబంధాలు ఏర్పరుచుకునేందుకు ఇస్రో ప్రయత్నం చేస్తోందని, చంద్రుడిపై నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సిగ్నల్ అందలేదని వెల్లడించారు. చంద్రుడి 14 రోజుల రాత్రి సమయంలో -150 డిగ్రీల సెల్సియస్ అత్యంత తీవ్రమైన చల్లని పరిస్థితులు సుదీర్ఘంగా ఉండటం వల్ల సిగ్నల్స్ అందకపోవచ్చని తెలిపారు. కాంటాక్ట్ పొందడానికి ప్రయత్నాలు కొనసాగుతాయని ప్రకటించారు.

Show comments