Site icon NTV Telugu

Nitin Gadkari: బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లేకపోవడం దేవుడు నాకిచ్చిన అతిపెద్ద వరం

Nitin Gadkari

Nitin Gadkari

బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లభించకపోవడం దేవుడు తనకు ఇచ్చిన అతి పెద్ద వరం అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన హల్బా సమాజ్ మహాసంఘ్ స్వర్ణోత్సవ వేడుకల్లో నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించారు. తాను కులాన్ని గానీ మతాన్ని గాని నమ్మనని చెప్పారు. కులం, మతం లేదా భాష కారణంగా ఏ మానవుడు గొప్పవాడు కాదని వ్యాఖ్యానించారు. వారి.. వారి లక్షణాల కారణంగానే మాత్రమే గొప్పవారు అవుతారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Shehbaz Sharif: నేటినుంచి 5 రోజులు అమెరికాలో పాక్ ప్రధాని పర్యటన.. ట్రంప్‌ను కలవనున్న షెహబాజ్ షరీఫ్

దేవుడు తనకు ఇచ్చిన అతి పెద్ద ఉపకారం ఏంటంటే రిజర్వేషన్ ఇవ్వకపోవడమే అన్నారు. ఇదే విషయాన్ని తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రస్తుతం మహారాష్ట్రలో రిజర్వేషన్లు, కోటా ఉద్యమం నడుస్తోంది. ఇలాంటి నిరసనల సమయంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించున్నాయి. ఇక విద్యావంతులకు, సంపన్నులకు కీలక పిలుపునిచ్చారు. సమాజ పురోగతి కోసం ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Netanyahu: ఇక పాలస్తీనా రాజ్యం ఉండదు.. మద్దతు దేశాలకు నెతన్యాహు హెచ్చరిక

గడ్కరీ నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదివారం హల్బా సమాజ్ మహాసంఘ్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గతంలో కూడా గడ్కరీ సమాజ మేలు కోరే ప్రసంగాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. గతేడాది నాగ్‌పూర్‌లో జరిగిన చార్మాకర్ సేవా సంఘ్‌లో ప్రసంగిస్తూ సమాజంలోని యువత ఉద్యోగార్థుల కంటే ఉద్యోగ ప్రదాతలుగా మారాలని కోరారు. విద్య శ్రేయస్సు చాలా కీలకం అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ చివరి చూపు కోసం లక్షలాదిగా తరలివచ్చిన అస్సామీయులు.. 25 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

Exit mobile version