Union Budget 2025: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు, వేతన జీవుల నుంచి పారిశ్రామిక నేతల వరకూ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఏయే అంశాలు ఉండొచ్చనే దానిపై పలు ఊహగానాలు వెలువడుతున్నాయి. అయితే, ఆదాయపు పన్ను విధానాన్ని సరళీకరించడంలో పాటు టాక్స్ శ్లాబ్స్ 6 నుంచి 3కు కుదించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు, గరిష్ఠ పన్ను రేటు 30 శాతం నుంచి దీనిని 25 శాతానికి తగ్గిస్తారని టాక్.
Read Also: Delhi Elections: మోడీ సభలో ఖాళీ కుర్చీలంటూ ఆప్ ఎగతాళి.. వీడియో పోస్టు
ఇక, మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా వారికి నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్‌ధన్ యోజన, ముద్ర యోజన లాంటి పథకాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. మార్చితో ముగుస్తున్న మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ గడువును కొనసాగించడం, లేదా కొత్త పథకాన్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటు సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకానికి రాయితీ కోసం బడ్జెట్‌లో కేటాయింపులను మరింత పెంచుతారని టాక్. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సహాయం చేయనుంది. ఇక, పట్టణ ప్రాంతాల్లో 2029 నాటికి కోటి మంది పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సాయం చేయనున్న ఈ బడ్జెట్ లో ప్రకటించనున్నారు.