Site icon NTV Telugu

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా

భార‌త్‌లో క‌రోనా థ‌ర్డ్ వేవ్ పంజా విసురుతోంది.. రోజుకో రికార్డు త‌ర‌హాలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్ప‌టికే పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్ర‌ముఖులు, ఉన్న‌తాధికారులు మహమ్మారి బారిన ప‌డిన విష‌యం తెలిసిందే కాగా.. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది.. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కిష‌న్ రెడ్డే స్వ‌యంగా వెల్ల‌డించారు.. త‌న‌కు కోవిడ్ పాజిటివ్‌గా వ‌చ్చింది.. స్వల్ప లక్షణాలు ఉన్నాయ‌న్న ఆయ‌న‌.. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్న‌ట్టుగా వెల్ల‌డించారు.. తనను ఈ మ‌ధ్య‌ కలసిన వారు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని.. త‌గిన జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి.

Read Also : పీఆర్సీ జీవో.. హై కోర్టులో పిటిషన్

Exit mobile version